ETV Bharat / state

petrol rates in ap : సగటు జీవి జేబు కాలుస్తున్న పెట్రో ధరలు - petrol price in ap

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఎవరికి వారు ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఈ పెట్రో మంటల్లో సగటుజీవి జేబులు కాలి పోతున్నాయి. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, లిక్కర్‌లను తీసుకు వస్తారన్న ఆశలు కూడా సమీప భవిష్యత్‌లో నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిణామాల మధ్యనే ప్రజలకు పెట్రోభారం మోయలేనిదిగా మారింది. ఎట్టకేలకు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. తరువాత దేశంలోని 24 రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ విధింపులో తోచినంత కనికరించాయి. అయినా కూడా వాహనదారులకు పెద్దగా ఊరట లభించలేదు. తెలుగు రాష్ట్రాల్లో అది కూడా లేదు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి.. ఈ పెట్రో పీడనలో టాప్ ఎవరు?

petrol rates in ap
petrol rates in ap
author img

By

Published : Nov 18, 2021, 8:51 PM IST

సగటు జీవి జేబు కాలుస్తున్న పెట్రో ధరలు

దేశంలో కొద్దిరోజులుగా చమురు మంటలు కాల్చేస్తున్నాయి. ఇప్పుడిది బహిరంగ రహస్యం. దాని ప్రభావం పేద, మధ్య తరగతి వర్గాలపై అల్లాడిపోతున్నాయి. వాహనం బయటకు తీయాలంటే భయం వేస్తోంది. ఈ రోజు గడిచేది ఎలా అన్న ఆందోళన వెంటాడుతోంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం పడని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. ఇదేమి బాదుడు మహప్రభో అంటున్నా.. సెంచరీ కొట్టిన ధరలు మాత్రం దిగి రావడం లేదు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కాస్తంత కనికరించి పెట్రోల్‌పై 5 రూపాయిలు, డీజిల్‌పై 10 రూపాయిలు లెక్కన ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. తర్వాత కొన్ని రాష్ట్రాలు ఆ బాటలో నడిచాయి. కానీ నేటికి ఆ ఊసే ఎత్తని రాష్ట్రాలూ ఉన్నాయి. అందులో తెలుగురాష్ట్రాలూ ఉన్నాయి. అన్నింటికంటే ఇబ్బందికరంగా అనిపిస్తోన్న అంశం... దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పెట్రో పోటు అధికంగా ఉండడం.

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు

విజయవాడ ఆంధ్రప్రదేశ్ 110.0396.14
ముంబయి మహారాష్ట్ర 109.9694.13
హైదరాబాద్‌ తెలంగాణ 108.1894.61
జైపుర్‌ రాజస్థాన్ 107.0890.70
తిరువనంతపురం కేరళ 106.3493.46
పట్నా బిహార్‌ 105.8791.08

ఈ లెక్కల్లో స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే. పెట్రోల్‌, డీజిల్ ధరల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానానికి చేరింది. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. పెట్రో ధరల్లో ఇప్పటి వరకు తొలిస్థానంలో నిలిచిన రాజస్థాన్‌ ఒక మెట్టు దిగిరావడంతో ఏపీ ఇలా టాప్‌లోకి వచ్చి చేరింది. లీటరు పెట్రోలుపై 4 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు మంగళ వారం జరిగిన రాజస్థాన్‌ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం జైపుర్‌లో పెట్రోలు లీటరు 107.08 రూపాయలు, డీజిల్‌ 90.70 రూపాయల చొప్పున లభిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఈ ధరలు వరుసగా 110.03 రూపాయలు, 96.08 రూపాయలు చొప్పున ఉన్నాయి. రాజస్థాన్‌తో పోలిస్తే.. ఏపీలో లీటరుకు పెట్రోలుపై 2 రూపాయల 95పైసలు, డీజిల్‌పై 5 రూపాయల 40పైసలు అధికం.

పెట్రోల్‌, డీజిల్ రెండు రకాల ఇంధన ధరల్లో ఏపీ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్‌ సవరణల తర్వాత దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోనే పెట్రోలు ధర లీటరు 105 రూపాయలు పైబడి ఉంది. డీజిల్‌ 90 రూపాయలు పైబడిన రాష్ట్రాలు 9 ఉన్నాయి. ఇందుకు కారణం ఆయా రాష్ట్రాల్లో పన్ను తగ్గింపులు చేపట్టకపోవడమే. మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ్‌బంగ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను భారాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఈ పన్నుల తగ్గింపు విషయంలో సామాన్యుల నుంచి ఆందోళనలే కాదు. కేంద్ర ప్రభుత్వం - రాష్ట్రాల మధ్య కూడా మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. అయినా.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మాత్రం పెట్రో పన్నులు తగ్గించేందుకు ముందుకు రాలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో పన్నులు

(రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నవి)

పెట్రోల్‌ రూ. 29.32

డీజిల్‌ రూ. 21.41

‍(దాదాపుగా)

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో పన్నులు

(కేంద్రం విధిస్తున్నవి)

పెట్రోల్‌ రూ. 22.85

డీజిల్ రూ. 26.70

‍(దాదాపుగా)

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో పన్నులు

‍(డీలర్ మార్జిన్‌)

పెట్రోల్ రూ. 3.80

డీజిల్ రూ. 2.50

రవాణా రూ. 1.00

‍(దాదాపుగా)

ముఖ్యంగా... పెట్రోలు, డీజిల్‌ ధరలు అక్టోబరులో పరుగులు తీశాయి. నెల రోజుల్లోనే 19 దఫాల్లో లీటరుపై 8 రూపాయల వరకు పెరిగాయి. జూన్‌ నాటితో పోలిస్తే.. లీటరుపై 15 రూపాయల వరకు పెరుగుదల చోటుచేసుకుంది. సగటున లీటరు డీజిల్‌పై రోజుకు 35 నుంచి 38 పైసలు, పెట్రోలుపై 31 నుంచి 36 పైసల చొప్పున ఇంధన సంస్థలు పెంచుతున్నాయి. దీంతో ఒక్క నెలలోనే 7.5% పెంపు చోటు చేసుకుంది. అక్టోబరు నెలాఖరుకు లీటరు పెట్రోలు 115 రూపాయలు దాటేయగా.. డీజిల్‌ 108 రూపాయలకు పైగా చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోలు 117.92 రూపాయలు, డీజిల్‌ 110.29 రూపాయలుగా ఉంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటరు పెట్రోలు 116.75 రూపాయలు, డీజిల్‌ 109.26 రూపాయల వరకు చేరింది. గుంటూరు జిల్లా పల్నాడులోని అధిక బంకుల్లో పెట్రోలు ధర రూ.116 పైనే ఉండగా.. డీజిల్‌ రూ.109కి చేరువైంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నడిచిన బాటల్లోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కాస్తోకూస్తే తగ్గించాల్సిందని నిపుణులు కూడా చెబుతునే ఉన్నారు.

ఈ పెట్రో పన్నులకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొంత ఆసక్తికరమైన చర్చను కూడా లేవనెత్తింది. ఇప్పటికీ కేంద్రం విధిస్తున్న పన్నులే అధికం అని పైగా రాష్ట్రాలకు వాటా ఇచ్చే అవసరం లేకుండా సెస్‌ల రూపంలో అధికంగా వసూలు చేస్తున్నారని కొన్ని గణాంకాలు వెల్లడించింది. ఆ మేరకు ఇటీవల కూడా కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందే కానీ సుంకాలను వదులుకోలేదని దానివల్ల రాష్ట్రాలకే నష్టమని... అందుకే తాము ధరలు తగ్గించలేమని ప్రకటించారు. ఇదే సమయంలో తమవైపు నుంచి వసూలు చేస్తున్న వ్యాట్ 2015 నుంచి నేటికీ 31 శాతం దాట లేదన్న ప్రభుత్వం ఆ రూపంలో వసూలు చేస్తున్న పన్ను మొత్తాలు ఎంతో చెప్పకపోవడం వివాదానికి దారి తీసింది. పైగా రోడ్‌ సెస్‌ అని అదనంగా భారం మోపడం ఏంటని ఆర్థికరంగ నిపుణులు ఆ రోజు నుంచి వరస ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ వివాదానికి ముగింపు ఎప్పుడో గానీ మధ్య పెట్రో మంటల్లో సామాన్యులే మాడి పోతున్నారు. అది గమనించి అయినా... ఎంతోకొంత ఊరటనిచ్చే చర్యలు చేపట్టాలని అన్ని వైపుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: Petrol Rates:పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించని తెలుగు రాష్ట్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.