ETV Bharat / state

రాష్ట్రంలో 85 శాతం పెరిగిన ఆహారధాన్యాల దిగుబడి - Increased food grain yields in telangana

పుడమితల్లి పులకించింది... తన కడుపు పంటగా ధాన్యరాశులను అందించింది... వరి, మొక్కజొన్న... అన్నీ విరగపండాయి. దిగుబడులతో తెలంగాణ కళకళలాడుతోంది. గత రికార్డులన్నీ చెరిగిపోయాయి... అనూహ్యంగా పెరిగిన పంటలు రైతుల ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నాయి.

Increased food grain yields in telangana
రాష్ట్రంలో 85 శాతం పెరిగిన ఆహారధాన్యాల దిగుబడి
author img

By

Published : Apr 26, 2020, 5:12 AM IST

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక స్థాయిలో దిగుబడులొస్తున్నట్లు ‘అర్థ, గణాంక శాఖ’ (డీఈఎస్‌) తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చింది. గడచిన ఖరీఫ్‌, ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లలో (2019-20) పండిన పంటల దిగుబడులపై ముందస్తు మూడో అంచనాల నివేదికను ఈ శాఖ క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా రూపొందించింది. అంతకుముందు ఏడాది (2018-19)తో పోలిస్తే ఈసారి ఆహార ధాన్యాల దిగుబడి సుమారు 85 శాతం అదనంగా పెరగవచ్చని గణాంకశాఖ అంచనా వేసింది. గత జులై నుంచి డిసెంబరు దాకా వర్షాలు అధికంగా పడ్డాయి. ప్రధాన ఆహార పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత విద్యుత్తు సరఫరా అయ్యింది. ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు పథకం కింద రైతులకు ఆర్థిక సాయం చేశారు.

ఇవన్నీ దిగుబడులు పెరుగుదలకు ప్రధానంగా దోహదపడ్డాయని డీఈఎస్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో సాధారణంగా జూన్‌లో ప్రవేశించే నైరుతి రుతుపవనాలతో జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య కురిసే వర్షాలే కీలకం. కానీ అప్పుడు కాకుండా అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఈశాన్య రుతుపవనాలతో 38.50 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. దీనివల్ల భూగర్భజల మట్టాలు 2019 మే నెలతో పోలిస్తే 2020 మార్చిలో ఏకంగా 4.05 మీటర్లు అదనంగా పెరిగాయి. వీటన్నిటి ఫలితమే పంటల వెల్లువ. డీఈఎస్‌ నివేదికను ‘ఈనాడు’ సేకరించింది. ఇందులో ముఖ్యాంశాలు..

Increased food grain yields in telangana
రాష్ట్రంలో 85 శాతం పెరిగిన ఆహారధాన్యాల దిగుబడి

రికార్డుల మోత

  • తెలంగాణ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి 2019-20లో పంటల సాగు విస్తీర్ణంలో అనూహ్య పెరుగుదల నమోదైంది. ఖరీఫ్‌, రబీ కలిపి 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంతకుముందు ఏడాది (2018-19)తో పోలిస్తే ఇది ఏకంగా 46.96 శాతం అధికం అని తేలింది. ఆహార ధాన్యాల దిగుబడులు కూడా రికార్డుస్థాయిలో పెరిగి 2.41 కోట్ల టన్నులొచ్చాయి. రాష్ట్ర సాధారణ దిగుబడి 1.14 కోట్ల టన్నుల కంటే ఇది 1.27 కోట్ల టన్నులు అదనం.
  • 2 కోట్ల టన్నులకు పైగా ఆహారధాన్యాలు పండటం తెలంగాణ చరిత్రలో ఇదే ప్రథమం. ఇంతకుముందు అత్యధిక దిగుబడి రికార్డు 2016-17లో 1.40 కోట్లు. ఈసారి అదనంగా కోటి టన్నులు పండటం మరో ప్రత్యేక రికార్డు.
  • మొత్తం ఆహారధాన్యాల దిగుబడులు 2.41 కోట్ల టన్నులుంటే అందులో కేవలం వరి, మొక్కజొన్నలే 2.34 కోట్ల టన్నులు.
  • వరి సాగు విస్తీర్ణం ఖరీఫ్‌లో 37.17, రబీలో 113 శాతం, రెండు సీజన్లకు కలిపి మొక్కజొన్న 121.37, సెనగ 28.4 శాతం అదనంగా పెరిగాయి.
  • 2018-19 ఖరీఫ్‌, రబీ సీజన్లలో మొత్తం 1.04 కోట్ల టన్నుల వరి ధాన్యం పండితే ఈసారి ఒక్క రబీలోనే అంతే స్థాయిలో ఏకంగా 1.03 కోట్ల టన్నుల దిగుబడి రావడం విశేషం.
  • వరి ఎకరానికి సగటు దిగుబడి రికార్డు 2016-17లో 25.85 క్వింటాళ్లు కాగా, ఈసారి అది చెరిగిపోయి... 26.52 క్వింటాళ్లుగా నమోదైంది.
  • మొక్కజొన్న దిగుబడి సుమారు వంద శాతం పెరిగి 40.78 లక్షల టన్నులకు చేరింది.

ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.