ETV Bharat / state

IT Refund Scam Telangana : 'తప్పుడు మార్గంలో రీఫండ్‌ పొందిన వారిపై ఐటీ చర్యలు'

author img

By

Published : Jul 1, 2023, 1:19 PM IST

Income Tax Frauds Telangana : తప్పుడు వివరాలు సమర్పించి లక్షలాది మంది టీడీఎస్​ రీఫండ్‌ పొందినట్లు.. ఆదాయపు పన్నుశాఖ ప్రాధమికంగా గుర్తించింది. ఈ మేరకు తెలుగురాష్ట్రాల్లో ఐటీ రిటర్న్‌లు దాఖలు చేస్తున్న చార్టర్డ్‌ అకౌంటెంట్లు, ఆదాయపన్ను ప్రాక్టీషనర్ల కార్యాలయాల్లో ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది. తప్పుడు మార్గంలో రీఫండ్‌ పొందిన వారిపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

IT Refund Scam In Telangana
IT Refund Scam In Telangana

'తప్పుడు మార్గంలో రీఫండ్‌ పొందిన వారిపై ఐటీ చర్యలు'

Income Tax Refund Scam Telangana : దేశవ్యాప్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ రీఫండ్‌ తీసుకున్న ఐటీ రిటర్న్‌దారులు, రిటర్న్‌లు దాఖలు చేసిన చార్టర్డ్‌ అకౌంటెంట్లు, ఆదాయపన్ను ప్రాక్టీషనర్లను ఐటీశాఖ విచారిస్తోంది. ఈ మేరకు టీడీఎస్ రీఫండ్‌ తీసుకున్న వారికి ఆదాయపన్ను అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల టీడీఎస్‌ రీఫండ్స్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించిన ఐటీశాఖ.. కొన్నింటిని లోతుగా పరిశీలించగా అక్రమాలు వెలుగు చూశాయి. తప్పుడు సమాచారంతో రీఫండ్‌ తీసుకున్న వారిని గుర్తించే పనిని అధికారులు ప్రారంభించారు. రిటర్న్‌లు దాఖలుచేసిన వారితో పాటు ఇప్పటికే రీఫండ్‌ తీసుకున్న వారి దస్త్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ విధానంలో సాగుతోంది. లోపాలను గుర్తించిన వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.

Income Tax Frauds Telangana : దేశం మొత్తం పరిశీలన జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి ఎక్కువ ఉన్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఇక్కడ ఐటీ, పార్మాష్యూటికల్స్‌ కంపెనీలు అధికంగా ఉండడం, అందులో పని చేస్తున్న లక్షలాది మందిలో భారీ మొత్తాలు వేతనాలు తీసుకునే వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరికి చెందిన ప్రతి ఏడాది మినహాయింపులు పోను అదనపు ఆదాయంపై సంబంధిత కంపెనీలు నేరుగా టీడీఎస్‌ కట్‌ చేస్తాయి. ఆ తరువాత ఆ ఫాం 16తో పాటు ఎల్‌ఐసీ, గృహరుణాలు, విద్యారుణాలు, రాజకీయ పార్టీలకు విరాలాలు, ప్రావిడెండ్‌ఫండ్‌, హ్యాండీక్యాప్‌డ్‌ అల్వెన్స్‌లు ఇలా వివిధ రకాల మినహాయింపులను అప్‌లోడ్‌ చేసి.. అప్పటికే కంపెనీల నుంచి చెల్లించిన టీడీఎస్‌ మొత్తాలను రీఫండ్‌ తీసుకుంటున్నారు.

IT Refund Scam Telangana : సిస్టమ్‌ ద్వారా జరిగే ప్రక్రియ అయ్యినందున వీరు అప్‌లోడ్‌ చేయగానే ప్రాధమిక పరిశీలన తర్వాత సంబంధిత రిటర్న్‌దారుడి బ్యాంకు ఖాతాలో జమవుతోంది. గడిచిన 15 రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలు ఓ ఐటీ ఉద్యోగి తనకు రూ.80 లక్షలకు పైగా వేతనం వస్తుండగా అందులో రూ.40 లక్షలు మొత్తాన్ని ఓ రాజకీయ పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు క్లైమ్‌ చేశారు. దానిని లోతైన పరిశీలన చేయగా అది ఫేక్‌ అని తేలినట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు. ఇలాంటివి వెలుగులోకి వస్తున్నట్లు చెబుతున్న ఐటీ ఈ ప్రక్రియ ఇప్పట్లో ముగియదని స్పష్టం చేస్తున్నారు.

IT Refund Scam In Telangana : ఐటీశాఖ గతంలో కూడా ఇలాంటి దందా కొనసాగినట్లు గుర్తించి చర్యలు తీసుకుంది. కానీ.. ఇప్పుడు టీడీఎస్‌ రీఫండ్‌ కుంభకోణం భారీగా జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అక్రమాలకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టిన ఐటీశాఖ.. దర్యాప్తు విభాగం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేస్తున్న చార్టర్డ్‌ అకౌంటెంట్లు, ఆదాయపనున్ను ప్రాక్టీషనర్‌ల కార్యాలయాలపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా కార్యాలయాలల్లో ఏవైనా నకిలీ పత్రాలకు చెందిన సమాచారం దొరుకుతుందా అన్న కోణంలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.