హైదరాబాద్‌లో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆందోళనకు దిగారు. నిన్న కరీంనగర్‌లో ఆదాయపన్నుశాఖ అధికారి వేణుగోపాల్‌పై దాడి ఘటనను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. బషీర్‌బాగ్‌లోని ఆయకర్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు.
సీ3 ఇన్‌ఫ్రా కంపెనీలో తనిఖీలకు వెళ్లిన అధికారిపై సిబ్బంది దాడి చేయడాన్ని ఖండించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
- ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా కేసులు, 2 మరణాలు