ఈ నెల 26 లేదా 27న రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సచివాలయ ప్రాంగణంలోనే నూతన భవనాలను నిర్మించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సచివాలయ నిర్మాణానికి 2016లోనే ముంబయికి చెందిన ఆర్కిటెక్ట్ సంస్థ భవన నమూనాలను రూపొందించింది.
సికింద్రాబాద్లోని బైసన్ పోలో ప్రాంగణంలో సచివాలయాన్ని కట్టాలని సీఎం భావించారు. ఆ ప్రతిపాదనలు ఇక లేనట్లేనని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల సచివాలయంలోని ఏపీ ప్రభుత్వ భవనాలను తెలంగాణకు కేటాయించేందుకు ఆ రాష్ట్రం అంగీకరించింది. ఇప్పటికే భవనాలు ఖాళీ చేసే పనుల ప్రక్రియ ఏపీ సర్కార్ మెుదలుపెట్టింది. అక్కడ భవనాలను కూల్చివేసిన తర్వాత నూతన నిర్మాణం చేపట్టాలనేది ప్రభుత్వం యోచన.
ఇవీ చూడండి : 'రాష్ట్రంలో పేదలందరికీ మెరుగైన వైద్యమే లక్ష్యం'