ETV Bharat / state

రైల్వే ప్లాట్​ఫామ్ టికెట్ ధర రూ.50కి పెంపు

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల తిరగకుండానే మరోసారి ప్లాట్​ఫామ్​ టికెట్​ ధరలను పెంచింది. స్టేషన్లలో రద్దీ తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించింది.

scr platform ticket prices
రైల్వే ప్లాట్​ఫామ్ టికెట్ ధర
author img

By

Published : Apr 12, 2021, 8:14 PM IST

కరోనా కట్టడిలో భాగంగా.. రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్లాట్​ఫామ్ టికెట్ ధరలు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. సికింద్రాబాద్ స్టేషన్​లో.. రూ.30 ఉన్న ధరను రూ.50కు పెంచుతున్నట్లు ప్రకటించింది.

రేపటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు.. సీపీఆర్​ఓ రాకేశ్ తెలిపారు. గతంలో రూ.10 ఉన్న ప్లాట్​ఫామ్​ ధరను ఇటీవలే రూ.30కి పెంచింది. నెల తిరగకుండానే మళ్లీ రూ.50కు పెంచడం.. తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

ఇదీ చదవండి: సాగర్​లో దూకుడు పెంచిన కమలనాథులు... రంగంలోకి ముఖ్య నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.