ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల కస్టడీకి అ.ని.శా. కోర్టు అనుమతి - ఎమ్మెల్యేల ఎరకేసు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

Poaching TRS MLAs Case Accused into Custody: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో... నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన అ.ని.శా. కోర్టు నిందితుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

custody
custody
author img

By

Published : Nov 9, 2022, 9:07 PM IST

Updated : Nov 9, 2022, 10:44 PM IST

Poaching TRS MLAs Case Accused into Custody: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన అ.ని.శా. కోర్టు ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చింది.

రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని... ఆ తర్వాత తిరిగి చంచల్​గూడ జైలుకు పంపించాలని న్యాయస్థానం షరతు విధించింది. దీంతో పోలీసులు చంచల్‌గూడలో జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి స్వామీజీలను కస్టడీలోకి తీసుకొనున్నారు. ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కానీ కోర్టు నిందితులను రెండు రోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ముగ్గురు నిందితులు ఉన్నారు. నిందితులను పోలీసులు రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు. నాంపల్లిలోని అనిశా ప్రత్యేక కోర్టులో పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

నిందితులు ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని... కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గురు నిందితుల వెనక ఎవరెవరున్నారనే విషయాలను తెలుసుకోవడానికి నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. రాజకీయ కారణాలతో ముగ్గురిపైనా అక్రమ కేసులు బనాయించారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఎక్కడ కూడా డబ్బులు లభించలేదని... సుప్రీంకోర్టు సైతం బెయిల్ ఇవ్వొచ్చనే విషయాన్ని ప్రస్తావించినట్లు నిందితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అసలేం జరిగిందంటే.. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్‌ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 9, 2022, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.