ETV Bharat / state

'బట్టీల్లో కూలీలను స్వస్థలాలకు పంపాలని హైకోర్టులో పిల్'

రాష్ట్రంలోని 810 ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని హైకోర్టులో పిల్​ దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో పశ్చిన ఒడిశా నుంచి వచ్చిన సుమారు లక్షన్నర మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మానవ హక్కుల ఫోరం అధ్యక్షుడు జీవన్​ కుమార్​ పేర్కొన్నారు. కేవలం పెద్దపల్లి జిల్లాలోనే దాదాపు 25వేలకు పైగా ఉన్నారని వివరించారు.

ఆ వలస కూలీలను పంపించే ఏర్పాట్లు చేయాలని పిల్​ దాఖలు

author img

By

Published : Jun 1, 2020, 6:01 PM IST

ఇటుక బట్టీల్లో పని చేసే కూలీలను స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పశ్చిమ ఒడిశా నుంచి వచ్చిన సుమారు లక్షన్నర మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మానవ హక్కుల ఫోరం అధ్యక్షుడు ఎస్.జీవన్ కుమార్ పిల్ దాఖలు చేశారు.

హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 810 రిజిస్టర్డ్ ఇటుక బట్టీలు ఉన్నాయని పిటిషన్​లో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోనే దాదాపు 25వేలకు పైగా కార్మికులు ఉన్నారని జీవన్​ కుమార్​ వివరించారు.

ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు గుత్తేదారులు పశ్చిమ ఒడిశా నుంచి కూలీలను తీసుకొచ్చారని.. వారంతా స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి కార్మిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఇటుక బట్టీలను సందర్శించి కార్మికులను గుర్తించి.. వారు రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని జీవన్ కుమార్ హైకోర్టును కోరారు. మేడ్చల్ రహదారిపై ఇప్పటికీ వలస కూలీలు నడుచుకుంటూ వెళ్తున్నారన్న వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరగనున్నందున.. దానితో కలిపి వింటామని హైకోర్టు పేర్కొంది.

ఇదీ చదవండి: 'వ్యాక్సిన్​ వచ్చే వరకు పాఠశాలలు తెరవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.