ETV Bharat / state

బిల్లులు చెల్లించక పడకేసిన విద్యుత్‌ దహనవాటికలు - ghmc neglected the facilities in cremations

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ శరవేగంగా విజృంభిస్తోంది. కొవిడ్‌ కట్టడితో పాటు.. ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన జీహెచ్ఎంసీ మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. కాలుష్య రహితంగా గ్రేటర్​లో ఏర్పాటు చేసిన విద్యుత్ దహన వాటికలు.. పడకేసినా పట్టించుకోవడం లేదు. కొన్ని ఉద్దేశ్యపూర్వకంగా నడింపించలేక పోగా.. మరికొన్ని విద్యుత్ బిల్లులు చెల్లించలేక నిరూపయోగంగా మారాయి. సనత్ నగర్ ఈఎస్ఐ విద్యుత్ దహన వాటిక బిల్లు 20 లక్షలు పేరుకుపోవడంతో.. 2 నెలలుగా ఇక్కడ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు ఏడాదిగా ఎల్పీజీ క్రిమిటోరియాలు పనులు ఇంకా మొదలు కాలేదు.

telangana latest news
సౌకర్యాల కల్పనపై జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం
author img

By

Published : Apr 10, 2021, 4:21 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి పై ఆందోళన చెందుతుంటే .. జీహెచ్ఎంసీ నిద్రమత్తులో కూరుకుపోయింది. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్ర , ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాల్లో అంతిమ సంస్కారాల కోసం.. కుటుంబ సభ్యులు మృతదేహాలతో వరుసలో ఉంటున్నారు. అక్కడ తీవ్రత ఆ స్థాయిలో ఉన్నప్పటికీ.. బల్దియా అప్రమత్తం కావట్లేదు. పైగా .. తన నిర్లక్ష్యంతో పనిచేస్తోన్న విద్యుత్తు దహనవాటికలను.. మూతపడేట్లు చేస్తోంది. జీహెచ్ఎంసీ తీరుతో.. కొవిడ్ మృతుల కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదెక్కడి నిర్లక్ష్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక చుట్టుపక్కల శ్మశానవాటికలను ఆశ్రయించి.. అంతిమ సంస్కారాలను పూర్తి చేసుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం..

గ్రేటర్ హైదరాబాద్‌లో 800 లకు పైగా శ్మశానాలుండగా ఐదు చోట్ల విద్యుత్తు దహనవాటికలు ఉన్నాయి. అందులోని ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియల కోసం పోటీ ఉంటుంది. బోయినపల్లి శ్మశానవాటికలోనూ అదే పరిస్థితి. ఇక అందరికీ అందుబాటులో ఉండేది అంబర్ పేట... సతన్ నగర్ ఈఎస్ఎ, బన్సీలాల్ పేట విద్యుత్తు దహనవాటికలే. సరిగ్గా .. వాటినే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం చేస్తోంది. తక్కువ రుసుముతో వేగంగా దహన సంస్కారాలు పూర్తి చేసే సౌకర్యాన్ని దూరం చేస్తోంది. మరమ్మతుల అనంతరం ఇటీవల అంబర్ పేట దహనవాటిక సేవలు పునఃప్రారంభమవగా.. పనిచేస్తున్న సనత్ నగర్, బన్సీలాల్ పేట కేంద్రాలను అధికారులు నిలిపివేశారు. వీటి మాదిరే ఎల్పీజీ దహన వాటికల్లోనూ.. గంటకో మృతదేహం భస్మం అవుతుంది. కాలుష్యం నామమాత్రం. కట్టెల వ్యాపారులతో చేతులు కలిపి... అధికారులు వీటి సేవలను అందుబాటులోకి రానివ్వట్లేదు.

గ్రేటర్ వ్యాప్తంగా శ్మశానాల్లో రద్దీ..

విద్యుత్‌ ఛార్జీలు చెల్లించలేక సిబ్బందితో.. పనిచేయించుకోలేక ఆధునిక దహన వాటికలను నిరుపయోగంగా మార్చుతోన్న జీహెచ్ఎంసీ వ్యవహారంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. గతేడాది జూన్ , జులై , ఆగస్టు నెలల్లో కొవిడ్ మరణాలతో పాటు.. ఇతర చావులు నగరంలో పెద్దయెత్తున నమోదయ్యాయి. జిల్లాల నుంచి చికిత్స కోసం నగరానికి వచ్చి మృత్యువాతపడ్డ వారికి .. లాక్ డౌన్‌తో ఇక్కడే అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. దాని కారణంగా గ్రేటర్ వ్యాప్తంగా శ్మశానాల్లో రద్దీ నెలకొంది. ఆ సమయంలో సనత్ నగర్ ఈఎస్ఎఐ హిందూ శ్మశానవాటిక చాలా మందికి చేదోడుగా నిలిచింది. ఏడాదిగా తమ వద్ద 5 వేల మృత దేహాలకు అంత్యక్రియలు జరిగాయని సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్తు దహనవాటికతో.. కట్టెలతో నిరంతరాయంగా దహన సంస్కారాలు చేపట్టామంటున్నారు. అంతగా సేవలందించిన విద్యుత్తు దహన వాటికను.. అధికారులు ఇటీవల పట్టించుకోవడం మానేశారు. విద్యుత్తు చార్జీలు చెల్లించట్లేదు. 20 లక్షల రూపాయలు బకాయి పేరుకుపోవడంతో రెండు నెలలుగా సేవలు ఆగిపోయాయి. ప్రస్తుతం రోజుకు 30 మృతదేహాలు వస్తున్నాయని... పరిస్థితి చూసి కొన్ని కుటుంబాలు పంజాగుట్ట, ఇతర శ్మశానవాటికలకు వెళ్తున్నాయని సిబ్బంది వాపోతున్నారు.

సేవలు మొదలవ్వలేదు..

అధికారులు పట్టించుకోకపోవడంతో బన్సీలాల్ పేట విద్యుత్తు దహనవాటికను... నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా సేవలు నిలిపివేశారని విమర్శలున్నాయి. ఎల్పీజీ దహన వాటికలదీ అదే తీరు. కొవిడ్ మహమ్మారి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, గతేడాది ఏప్రిల్ లో పురపాలకశాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్ నగర వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే ఎల్పీజీ దహనవాటికల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ద్వారా ఎల్బీనగర్ జోన్‌లోని మన్సూరాబాద్ , సాహెబ్ నగర్‌లో.. చార్మినార్ జోన్‌లోని సంతోష్ నగర్ , మలక్ పేటలో , శేరిలింగంపల్లి జోన్ లోని పటాన్ చెరులో, కూకట్ పల్లి జోన్‌లోని మూసాపేటలో, సికింద్రాబాద్ జోన్‌లోని మల్కాజిగిరి, ఎస్పీనగర్ లో... ఖైరతాబాద్ జోన్‌లోని మెహిదీపట్నం, దేవునికుంట, బొందలగడ్డల్లో పనులు ప్రారంభించారు. ఒక్కో కేంద్రానికి 90 లక్షల నుంచి 98 లక్షల రూపాయులు ఖర్చయ్యింది. ప్రయోగాలు పూర్తయి.. అక్టోబరు 2020 నాటికి కేంద్రాలన్నీ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. కానీ ఇప్పటి వరకు సేవలు మొదలవలేదు. నిర్వహణ ఏజెన్సీలను ఎంపిక చేస్తున్నామంటూ... అధికారులు తాత్సారం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రైవేటు వైద్యకళాశాలల్లోను కొవిడ్​ సేవలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.