ETV Bharat / state

Portrait Rangoli: హైదరాబాద్​కు పోట్రేట్ రంగోళి... ఆకట్టుకుంటున్న ధారావి యువత - Telangana news

రంగోళి అందరికి సూపరిచితమైన కళే. అందులో భిన్నరూపాలు. వాటిలో మహారాష్ట్ర, ఛత్తీస్​గడ్ లాంటి ప్రాంతాల్లో బహు ప్రాచుర్యం పొందిన పోట్రేట్ రంగోళి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​కు విచ్చేసింది. హైటెక్ సిటీ శిల్పారామంలో స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ వారి పోట్రేట్ చిత్రాలను రంగోళితో వేసి ఆకట్టుకుంటోంది ముంబయి యువత. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరవాసుల సందర్శనతో పాటు, సున్నితమైన ఈ కళను ప్రయత్నించే వర్క్ షాప్​ను సైతం ఏర్పాటు చేశారు.

portrait
పోట్రేట్
author img

By

Published : Aug 14, 2021, 8:27 PM IST

Updated : Aug 14, 2021, 8:46 PM IST

హైదరాబాద్​కు పోట్రేట్ రంగోళి... ఆకట్టుకుంటున్న ధారవి యువత

మీరు చూస్తోన్న ఈ ఆర్ట్ పేరు పోట్రేట్ రంగోళి (Portrait Rangoli). మామూలుగా ఇంటి ముందర వాకిట్లో వేసే ముగ్గును వీరు సంస్కార్ భారతి (Samskar Bharati) అని పిలుస్తుంటారు. అయితే ఈ పోట్రేట్ రంగోళిపై ఉత్తరాది రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్లు, వర్క్ షాప్​లు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రాచీనమైన ఈ కళను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ముంబయికి చెందిన ఈ కళాకారులు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

ఇండిపెండెన్స్ డే థీమ్...

ప్రస్తుతం హైటెక్ సిటీలోని శిల్పారామంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే వీరిని హైదరాబాద్​కు ఆహ్వానించింది. ఇండిపెండెన్స్ డే థీమ్​ (Independence Day theme)తో స్వాతంత్య్ర సమరయోధులైన గాంధీజీ, నేతాజీ, భగత్​సింగ్, బాలగంగాధర్ తిలక్ వంటి మహనీయులతో పాటు.. జాతి నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ వంటి నేతల చిత్రాలను ఈ ముంబయి యువత (Mumbai Youth) అబ్బురపరిచేలా తీర్చిదిద్దుతున్నారు.

దాని వెనుక ఓపిక, కష్టం...

స్వాతంత్య్ర థీమ్​తో పాటు బాల్యవివాహం, బ్రూణహత్యలు వంటి సామాజిక సమస్యలు, వివాహ, జన్మదిన వేడుకల్లో ఈ పోట్రేట్ రంగోళిని వేస్తుంటారు. ఒక్కో రంగోళి వేసేందుకు ఆరు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. ఈ ఆర్ట్ ఫామ్​లో సహజ రంగులనే వినియోగిస్తుంటారు. సహజ రంగులతో వేసే ఈ ప్రక్రియ చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నా... వెనుక చాలా ఓపిక, కష్టం దాగుంటాయని ఆర్టిస్ట్ శ్రుతి కృపాల్ అంటున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోట్రెట్ రంగోళి ప్రదర్శన

కెరీర్​గా రంగోళి...

మహారాష్ట్రలో పోట్రేట్ రంగోళిపై వర్క్ షాప్​లు, ప్రదర్శనలు జరుగుతుంటాయి. మా కళను ఇక్కడా పరిచయం చేయాలని వచ్చామని ఆ కళాకారులు చెప్పారు. ఆర్డర్లపై కస్టమైజ్ రంగోళి సైతం వేస్తుంటామని.. వీరిలో కొంతమంది వారి హాబీ, ప్యాషన్​గా కొనసాగిస్తుండగా.. మరికొంత మంది దీన్నే ఓ కెరీర్​గా ఎంచుకున్నారు. కష్టాన్ని బట్టి ఒక్కో రంగోళి పదివేల నుంచి 50 వేల వరకూ ఛార్జ్ చేస్తామని తెలిపారు. నిరంతరం రద్దీ, జనసమ్మర్థమైన ముంబయితో పోల్చితే.. ఇక్కడ శిల్పారామంలో చాలా ఆహ్లాదకరంగా ఉందని, హైదరాబాద్ చాలా నచ్చేసిందని మొదటిసారి వచ్చిన శ్రుతి అంటున్నారు.

సిద్ధహస్తులు...

ధారావి నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎక్కువగా ఈ పోట్రేట్ రంగోళిలో సిద్ధహస్తులు. రాజకీయ, సినీ ప్రముఖుల వేడుకల్లో ఈ పోట్రేట్ రంగోళి ఎక్కువగా ఆదరిస్తారని వారంటున్నారు. ఆర్ట్ టీచర్​గా ఉన్న రోషన్ రమేశ్​.. తన విద్యార్థులకు పోట్రేట్ రంగోళిని ఒక ఆర్ట్ ఫామ్​గా నేర్పిస్తున్నారు. అకడమిక్స్​తో పాటు ఇలాంటి నైపుణ్యాలు అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన తెలిపారు.

మానసిక ఉల్లాసానికి...

ఇంటీరియర్ డిజైనర్​గా పనిచేస్తోన్న సిద్దేశ్​ అనంత్ భోగ్లే మానసిక ఉల్లాసానికి ఈ ఆర్ట్ ప్రక్రియ నేర్చుకున్నారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే పలు ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. రంగోళి కలర్లతో తాము రూపొందించే ఆర్ట్ రూపాలు చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాయని అంటోన్న సిద్దేశ్ హైదరాబాద్​లోని శిల్పారామంలో లోక్ మాన్య తిలక్, సావర్కర్, తిరంగా ర్యాలీ, ముక్తి సంగ్రామ్, చార్మినార్ వంటి కళారూపాలను తీర్చిదిద్దారు. రంగోళి ఆడవారికే చెందిన కళ కాదని.. పోట్రేట్ రంగోళితో తన ఇంటీరియర్ డిజైనింగ్​తో పాటు, తన వ్యాపారం పెరిగిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: GOVERNOR TAMILISAI: 75వ స్వాతంత్య్ర దినోత్సవం... దేశ చరిత్రలో గొప్పదినం

Last Updated : Aug 14, 2021, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.