ETV Bharat / state

Presidential Orders: అన్ని సంస్థలు, కార్పొరేషన్లలోనూ 95 శాతం స్థానిక రిజర్వేషన్లు

Presidential Orders: 2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు లభించనున్నాయి.

Presidential
Presidential
author img

By

Published : Feb 19, 2022, 4:10 PM IST

Presidential Orders: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లోనూ ఉద్యోగ నియామకాలకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లు వర్తించనున్నాయి. 2018 రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. అదే తరహాలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లోనూ స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, కంపెనీలు, సంస్థలు, సొసైటీల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టి ఈ నెల 23వ తేదీ వరకు సాధారణ పరిపాలనా శాఖకు నివేదిక పంపాలని సీఎస్ తెలిపారు.

ఇదీ చూడండి: Kishan Reddy on National Highways: 'రీజినల్ రింగ్‌రోడ్డు రాకతో కీలక మార్పు ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.