హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారత భవన్లో తెలంగాణ పబ్లిక్ సెక్టార్-కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక నాయకులు సన్నాహక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తక్షణమే పీఆర్సీ ప్రకటించి తేదీ 01-07-2018 నుంచి అమలు చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 16 మే 2016న ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్లపై సీఎం దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్లినా పట్టించుకోక పోవడం లేదని పేర్కొన్నారు. అందుచే ఈనెల రెండో వారంలో అసెంబ్లీని ముట్టడించనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కక్ష్య సాధింపులు మానుకుని ఉద్యమం ఉద్ధృతం కాకముందే డిమాండ్ల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రాష్ట్ర వేదిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : చిరంజీవి 'ది లెజెండ్' పుస్తకాన్ని ఆవిష్కరించిన హీరో రాంచరణ్