South Central Railway: భారీవర్షాల ప్రభావం దక్షిణ మధ్య రైల్వేపై కూడా పడింది. పట్టాల పైకి వరదనీరు చేరడం, ట్రాక్ కొట్టుకుపోవడం వంటి సమస్యలతో దక్షిణ మధ్య రైల్వే ఇవాళ్టి నుంచి ఎల్లుండి(జులై 13) వరకు పది రైళ్లను రద్దు చేసింది.
రైల్వే విభాగం రద్దు చేసిన రైళ్లు వివరాలు:
- సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు
- సికింద్రాబాద్-ఉందానగర్ మేము రైలు
- మేడ్చల్- ఉందానగర్ మేము ప్రత్యేక రైలు
- ఉందానగర్-సికింద్రాబాద్ మేము ప్రత్యేక రైలు
- సికింద్రాబాద్-ఉందానగర్ మేము ప్రత్యేక రైలు
- హెచ్.ఎస్ నాందేడ్-మేడ్చల్-హెచ్.ఎస్ నాందేడ్ రైలు
- సికింద్రాబాద్-మేడ్చల్ మేము రైలు రద్దు
- మేడ్చల్-సికింద్రాబాద్ మేము రైలు రద్దు
- కాకినాడ పోర్ట్-విశాఖపట్నం మేము రైలు రద్దు
- విజయవాడ-బిట్రగుంట మేము రైలు రద్దు
మరోవైపు భారీ వర్షాలు, నిర్వహణ సమస్యల కారణంగా నగరంలో పలు ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 13 వరకు 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేని వానతో నగర వాసులు ప్రజారవాణా సాధనాలను అధికంగా వినియోగిస్తున్నారు. మెట్రో సర్వీసులు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నా సిటీ బస్సులన్నీ రోడ్డెక్కాయని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరి చెప్పారు.
ఇవీ చదవండి: భారీ వరదతో ప్రాజెక్టులకు జలకళ.. గేట్లు ఎత్తి నీటి విడుదల