ETV Bharat / state

'గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం'

author img

By

Published : Jan 7, 2021, 9:36 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షుడు మంద భీమ్ రెడ్డి విమర్శించారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో మాజ్దుర్ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహించారు.

Mazdur Pravasi Bharatiya Divas at Bashir Bagh Press Club
బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో మాజ్దుర్ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహణ

గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షుడు మంద భీమ్ రెడ్డి విమర్శించారు. దిల్లీలో నిర్వహిస్తున్న ప్రవాస భారతీయ దివస్ వేడుకలు సంపన్న ఎన్నారైల కోసమేనని ఆరోపించారు.

విస్మరించింది..

దిల్లీలో 16వ ప్రవాసి భారతీయ దివస్ వేడుకల్లో గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు కల్పించకపోవడానికి నిరసనగా.. బషీర్ బాగ్ ప్రెస్​క్లబ్​లో మాజ్దుర్ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహించారు. పేద గల్ఫ్ శ్రామికుల సమస్యలు కేంద్రం విస్మరించిందన్నారు. కరోనాతో విదేశాల్లో జీవనోపాధి కోల్పోయిన వలసదారులు పెద్ద సంఖ్యలో స్వదేశానికి తిరిగొచ్చారని పేర్కొన్నారు.

కార్మికులు పెండింగ్ జీతాలు పొందలేక అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. కనీస వేతనాలను 30 నుంచి 50 శాతం వరకు తగ్గిస్తూ కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. అందువల్ల లక్షలాది మందికి సమాన పనికి సమాన వేతనం అందడం లేదు.

-మంద భీమ్ రెడ్డి, ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షుడు

వివక్ష..

వేతన తగ్గింపు సర్క్యులర్లు వెంటనే రద్దు చేయాలని భీమ్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల కష్టార్జితంతో ప్రభుత్వాలు లాభం పొందుతున్నాయని ఆరోపించారు. వారి సంక్షేమానికి కృషి చేయకుండా వివక్ష చూపుతున్నాయని విమర్శించారు.

కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం.. గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ బడ్జెట్ సమావేశాల్లో రూ.500 కోట్లు కేటాయించాలి. గల్ఫ్​ దేశాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్ధిక సహాయం అందించాలి.

-కోటపాటి నరసింహ నాయుడు, మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు

ఇదీ చూడండి: గల్ఫ్‌ దేశాల్లో ప్రవాస కార్మికులకు భరోసా కరవు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.