హైదరాబాద్‌లో మినీ ట్యాంక్‌బండ్ సరూర్నగర్ చెరువు గణపతి నిమజ్జనానికి సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్ రావు తెలిపారు. ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు ఆంక్షాలు విధించినట్లు వివరించారు. ఇంతముందులా రెండు ప్రవేశాలు కాకుండా... ఒకటే ప్రవేశం ఉండనున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిఘానేత్రాలను కూడా అమర్చినట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాలను కట్టపైకి తీసుకురాకూడదన్నారు. కట్ట కింద నాలుగు వైపులా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నియమాలను గ్రహించి నిర్వాహకులు, సందర్శకులు సహకరించాలని ఏసీపీ కోరారు.
ఇదీ చూడండి: కళ్లు మూస్తూ... తెరుస్తూ... సందడి చేస్తున్నా విఘ్నేశ్వరుడు