ETV Bharat / state

రెండురోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

author img

By

Published : Jun 15, 2020, 8:55 PM IST

ఇవాళ్టితోపాటు రాగల రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Imd weather report for telangana
రాగల రెండు రోజులు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు

ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం, బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఉత్తర అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, డయ్యూ మొత్తం ప్రాంతాలు, మధ్యప్రదేశ్ లో మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్​గఢ్, జార్ఖండ్, బిహార్​లో మిగిలిన ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్​లో కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

తూర్పు మధ్యప్రదేశ్​లో మరికొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్​లో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటలలో విస్తరించే అవకాశం ఉందన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా జూన్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

ఇవీ చూడండి: చెత్త ఏరుకునే బాలికపై అత్యాచారయత్నం... యువకుల దేహశుద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.