కుండపోతగా కురిసి రాష్ట్రాన్ని కుదిపేసిన వానలు కాస్త విరామం తీసుకుని.. మళ్లీ వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవాళ, రేపు భారీ నుంచి వర్షాలు రానున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు (Heavy Rain Alert in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) వెల్లడించింది. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ సంచాలకులు తెలిపారు. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి, నేడు దక్షిణ కర్ణాటక నుంచి... తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9కి.మీ ఎత్తున కొనసాగుతుందని వివరించారు.
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఈ రోజు గంగేటిక్ పరిసర ప్రాంతాల్లో ఉండి సగటు సముద్రమట్టం నుంచి 5.8కి.మీ వరకు కొనసాగుతుందని వివరించారు. దాని ప్రభావంతో వర్షాలు (Heavy Rain Alert in telangana) కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: ముంచెత్తిన భారీ వర్షాలు- స్తంభించిన జన జీవనం
RAINS: ఉపరితల ద్రోణి ప్రభావం.. మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు