తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చాలా చోట్ల వర్షాలు.. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళఖాతం దానికి అనుకొని ఉన్న ఒడిశా, పశ్చిమ బంగా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 7.6 కిలో మీటర్ల ఎత్తులో ఉందని.. రానున్న రెండు రోజుల్లో అల్పపీడనంగా మారి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం, ద్రోణులు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు ఏర్పడక పోవడం వల్ల గాలిలో తేమ శాతం తగ్గి సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. తెలంగాణలో 75 శాతం మేర లోటు వర్షపాతం నమోదైందంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఇవీ చూడండి: కొండగట్టు వెళ్లే బస్లో 125మంది... సీజ్