ETV Bharat / state

శంషీగూడ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైదరాబాద్ కూకట్ పల్లి మండలం శంషీగూడ సర్వే నెంబర్ 57 ప్రభుత్వ భూమిలో సెలవులను ఆసరాగా చేసుకొని అక్రమ కట్టడాలను నిర్మించారు. ఈ మేరకు ఆయా కట్టడాలను రెవెన్యూ అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు.

'పర్యవేక్షణ లేదని రియల్ దందా సాగిస్తున్నారు'

author img

By

Published : Mar 11, 2020, 7:21 AM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి శంషీగూడ ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో సర్వే నెంబర్ 57కు చెందిన ఎకరంన్నర ప్రభుత్వ స్థలం ఉంది. వరుస సెలవులు రావడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొందరు రియల్ వ్యాపారులు ఆ స్థలాన్ని ఆక్రమించారు. అనంతరం గదులు నిర్మించి మోసపూరితంగా పేద, మధ్య తరగతి ప్రజలకు అంటగడుతున్నారు.

స్థలం చుట్టూ కంచె పెట్టాలి...

ఓ తెరాస నాయకురాలి నిర్మాణాన్ని కూల్చివేసేందుకు సిబ్బంది రాగా అడ్డుకున్నారు. ఫలితంగా పోలీసుల సహాయంతో రెవెన్యూ సిబ్బంది నిర్మాణాన్ని కూల్చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని రెండు నిర్మాణాలను నేల‌మట్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు కూల్చేసినప్పటికీ తిరిగి సెలవు రోజు సమయంలో నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకొని ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆయా స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

'పర్యవేక్షణ లేదని రియల్ దందా సాగిస్తున్నారు'

ఇవీ చూడండి : ఖమ్మం జిల్లా కార్మికశాఖ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.