ఆంధ్రప్రదేేశ్ విజయవాడ నగరంలోని మసాజ్ సెంటర్లలో గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.. మొగల్రాజపురంలో ఓ మసాజ్ పార్లర్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు పురుషులు, ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 చరవాణులు, రూ. 76 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
యువతులకు మాయమాటలు చెప్పి.. వారితో అసభ్య కార్యకలాపాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. పార్లర్ నిర్వాహకురాలిపై 2018లో మాచవరం పోలీస్ స్టేషన్లో ఇదే తరహాలో కేసు నమోదైందని పోలీసులు గుర్తించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.