ETV Bharat / state

ఈవీఎంలపై నమ్మకం లేదు.. 'వీవీ ప్యాట్​లు'' లెక్కించాల్సిందే! - వీవీప్యాట్​ల లెక్కింపు

ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశాయి విపక్షాలు. ఎవరికి ఓటు వేసినా... అధికార పార్టీకి వెళ్లేలా యంత్రాలను తయారు చేశారని నేతలు ఆరోపించారు. కనీసం 50 శాతం వీవీప్యాట్​ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు.

అఖిలపక్ష సమావేశం
author img

By

Published : Apr 14, 2019, 9:00 PM IST

దిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో భాజపాయేతర రాజకీయ పార్టీలు సమావేశమయ్యాయి. తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వీ, ఆప్ నేత సంజయ్ సింగ్, విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంపై చర్చ జరిగింది. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాల ఆరోపణలపై మాట్లాడారు. ఈవీఎంలలో లోపాలపై సాంకేతిక నిపుణులతో చర్చించారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అంశంపై సమాలోచనలు జరిపారు.

''అవి.. పనికిరాని ఈవీఎంలు''

సాంకేతికత ఎక్కడ వాడాలి.. ఎక్కడ వాడకూడదో తెలుసుకోవాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల్లో పనికిరాని ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపును అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ అంశంపై సుప్రీంకోర్టులో పోరాడతామని స్పష్టం చేశారు.

యంత్రాలపై విశ్వాసం లేదు: కపిల్ సిబల్

యంత్రాలపై విశ్వాసం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. పేపర్‌ బ్యాలెట్‌పైనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఓటరు ఎవరికి ఓటు వేస్తారో వారికే ఓటు చెందాలన్నారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపును ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. యంత్రాలు ఎలా దుర్వినియోగం అవుతాయో తాము చూపిస్తామని సవాల్ విసిరారు.

వీవీప్యాట్​ లెక్కించాల్సిందే!

దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం లేదని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించకపోతే కనీసం వీవీప్యాట్‌లు లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం యంత్రాల్లో భాజపాకే ఓటు వెళ్లేలా ప్రోగ్రామ్‌ చేశారని ఆరోపించారు. దిల్లీలో 30 లక్షలు, తెలంగాణలో 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. న్యాయబద్ధంగా ఎన్నికల్లో గెలవాలని హితవు పలికారు.

లక్షలాది ఓట్లు తొలగించారు!

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలనేది తమ ప్రధాన డిమాండ్‌ అని తెలిపారు కాంగ్రెస్ నేత అభిషేక్‌ మను సింఘ్వీ. తమ పోరాటానికి 15 ప్రాంతీయ, 6 జాతీయ పార్టీలు మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. ఎలాంటి పరిశీలన లేకుండా లక్షలాది ఓట్లను ఎలా తొలగిస్తున్నారని ప్రశ్నించారు.

ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన విపక్షాలు

ఇదీ చదవండి : వాళ్లను అనుర్హులుగా ప్రకటించండి: భట్టి

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
—24 HOUR USE ONLY
—MANDATORY ON SCREEN COURTESY: "SATURDAY NIGHT LIVE/BROADWAY VIDEO"
—1 MIN ONLY
CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
SATURDAY NIGHT LIVE/BROADWAY VIDEO
New York, 13 April 2019
1. BTS perform "Mic Drop Live" on SNL
STORYLINE:
BTS PERFORM ON "SATURDAY NIGHT LIVE"
K-Pop phenomenon BTS performed on the latest edition of NBC's " Saturday Night Live" (13 APRIL)
The group - RM, Jungkook, V, J-Hope, Jin, Suga and Jimin - performed their new single "Boy with Luv" featuring Halsey for the first time. They also performed another hit, "Mic Drop."
They released their latest album " Map of the Soul: Persona" on Friday (12 APRIL) after a year which has already seen them present at the Grammy Awards.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.