ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు ప్రతాపరెడ్డిని హుజూర్నగర్ అభ్యర్థిగా ఆ సంఘం నేతలు ప్రకటించారు. నిరుద్యోగ యువత తమ వాణిని అసెంబ్లీలో వినిపించడానికి ఉద్యమకారుడైన ప్రతాప్ రెడ్డికే ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులను విస్మరించాయని అందుకే ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు.
తనను గెలిపిస్తే స్థానిక కంపెనీల్లో స్థానికులకే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని ఓయూ జేఏసీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి ఉచిత వైద్యం అందించేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : "తెలంగాణలోనూ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురావాలి"