ETV Bharat / state

తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్‌ విడుదల - telangana icet 2021 details

telangana icet 2021
telangana icet 2021
author img

By

Published : Apr 3, 2021, 1:05 PM IST

Updated : Apr 3, 2021, 2:27 PM IST

13:04 April 03

తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్‌ విడుదల

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021-2022 ఐసెట్ నోటిఫికేషన్​ను ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి విడుదల చేశారు. మొత్తం 14 రీజినల్ సెంటర్లలో 60 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో 10 రీజినల్ సెంటర్స్​ను ఏర్పాటు చేయగా... ఆంధ్రప్రదేశ్​లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూల్ సెంటర్లను ఏర్పాటు చేసిన్నట్లు వివరించారు.

ఈ నెల 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జూన్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సాగుతుందని తెలిపారు. రూ.250 అపరాధ రుసుంతో జూన్ 30 వరకు, రూ.500 అపరాధ రుసుంతో జులై 15 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో ఆగస్టు 11 వరకు ఐసెట్ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉందన్నారు. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 17న ఐసెట్ ఫలితాలు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. 

Last Updated : Apr 3, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.