ETV Bharat / state

'ఐసెట్​ ప్రవేశ పరీక్ష షెడ్యూలు ఖరారు'

author img

By

Published : Feb 12, 2020, 9:40 PM IST

ఎంబీయే, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఐసెట్ పరీక్ష షెడ్యూలు ఖరారయింది. మార్చి 6న నోటిఫికేషన్​ విడుదల... మే 20, 21 తేదీల్లో పరీక్ష నిర్వహణ... జూన్ 13న ఫలితాలు వెల్లడించాలని కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

Icet_Schedule
Icet_Schedule

టీఎస్​ ఐసెట్​ ప్రవేశ పరీక్ష తేదీలను ఐసెట్​ కమిటీ నిర్ణయించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల... మార్చి 9 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తుల స్వీకరణ... ఆలస్య రుసుముతో మే 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని కమిటీ తెలిపింది.

మే 14 నుంచి హాల్ టికెట్లను డౌన్​లోడ్ చేసుకోవచ్చని... మే 20, 21 తేదీల్లో పరీక్ష నిర్వహణ... మే 29న ప్రాథమిక కీ విడుదల... జూన్ 1 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. జూన్ 13న ఐసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు సైతం ఈ ఏడాది పరీక్ష రుసుములో రాయితీ ఇవ్వాలని ఐసెట్ కమిటీ నిర్ణయించింది. జనరల్ అభ్యర్థులు 650 రూపాయలు... ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 450 రూపాయలు ఆన్ లైన్​లో ఫీజు చెల్లించాలని చెప్పింది. ఈ ఏడాది ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ యూనివర్సిటికీ ఉన్నత విద్యా మండలి అప్పగించింది.

ఐసెట్​ ప్రవేశ పరీక్ష షెడ్యూలు ఖరారు

ఇదీ చూడండి: తుపాకులగూడెం ఆనకట్టకు సమ్మక్క పేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.