నవంబర్ 3 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది (ts Icet Counseling 2021). ఐసెట్ మొదటి, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం నవంబరు 3 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్ ఉంటుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. నవంబరు 6 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. నవంబరు 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. నవంబరు 14న ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. నవంబరు 14 నుంచి 18 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
నవంబరు 21న ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్తో ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది (ts Icet Counseling 2021). నవంబరు 22న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన, 22, 23న తుది విడత వెబ్ఆప్షన్ల నమోదు చేపట్టి... 26న తుది విడత సీట్లను కేటాయించనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కోసం నవంబరు 28న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ICET results 2021: ఐసెట్ ఫలితాలు విడుదల.. 90.09 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత