అనుకోని ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని... ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఐ కాట్ సంస్థ ఆఫ్గనిస్థాన్ నుంచి హైదరాబాద్‌కి చేర్చింది. హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి... ఆఫ్గనిస్థాన్‌లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన నడుముకు తీవ్రగాయం అయింది. అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఆఫ్గనిస్థాన్‌లో ఎలాంటి శస్త్ర చికిత్సలు నిర్వహించడంలేదు. దీనితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని.. ఐ కాట్ సంస్థ ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి తీసుకువచ్చారు.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలను సమన్వయం చేసి.. ఇతర దేశాల సర్కారు నుంచి కావాల్సిన అనుమతులను తీసుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఒక ఎయిర్ అంబులెన్స్ ద్వారా రోగిని షిఫ్ట్ చేయడం ఇదే తొలిసారి. ఈ అంబులెన్స్‌లో అత్యవసర సాయం అందించే వైద్యులు అందుబాటులో ఉంటారని ఐ కాట్ సంస్థ ప్రకటించింది.
ఇవీ చూడండి: రైతులను అవమానించడం క్షమించరాని నేరం: ఈటల