ETV Bharat / state

రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది

అన్నదాత ఆదాయం రెట్టింపు కావాలంటే ఏమేం చేయాలో రాష్ట్రానికి ఐసీఏఆర్​ పలు సిఫార్సులు చేసింది. 2022-23 నాటికి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలంది. పాల ఉత్పత్తి పెంచుతూ మేకల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని సూచించిది. గ్రామాల్లోని నిరుద్యోగులతో అగ్రి క్లినిక్​లు ఏర్పాటు చేయాలంది.

Only if we encourage farmers ... will increase income
రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది
author img

By

Published : Jun 20, 2020, 8:15 AM IST

రాష్ట్రంలో రైతు కుటుంబ ఆదాయం రెట్టింపు కావాలంటే పంటల సాగుతో పాటు పాడి, మత్స్య పరిశ్రమలు, అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్‌) స్పష్టం చేసింది. దేశంలో రైతులందరి ఆదాయం 2022-23 చివరికల్లా రెట్టింపు కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో సూచిస్తూ రాష్ట్రాల వారీగా ఐసీఏఆర్‌ సమగ్ర నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చేసిన సిఫార్సుల్లో ముఖ్యాంశాలు..

  • రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల పంటల సాగు, దిగుబడుల పెంపు ద్వారా రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు అవకాశాలున్నాయి.
  • పంట ఉత్పాదకత పెరిగితే రైతుల ఆదాయంలో 33 శాతమే పెరుగుతుందని నీతిఆయోగ్‌ పేర్కొంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే మరో 33 శాతం, ఇతర మార్గాల ద్వారా ఇంకో 33 శాతం ఆదాయం పెంచడానికి అవకాశముంటుంది.
  • గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల నిరుద్యోగులతో అగ్రి క్లినిక్‌ల ఏర్పాటు చేయించాలి. వ్యవసాయ వాణిజ్య సముదాయాలను ప్రోత్సహించాలి.
  • వ్యవసాయాభివృద్ధికి వర్షాధార భూముల్లో వాననీటి సంరక్షణకు నీటి కుండీల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. రాయితీలిచ్చి వీటిని నిర్మించడానికి రూ.5 వేల కోట్లను బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇప్పించాలి.
  • ప్రభుత్వం పాడి పరిశ్రమకు రూ.1000 కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.500 కోట్లు, గొర్రెలు, మేకల అభివృద్ధికి రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకోవాలి. ఆయా రంగాల వృద్ధికి ఖర్చు చేయాలి.
    icar-instructions-to-telangana-to-increase-farming
    రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది
  • పాల ఉత్పత్తి ఏటా 5 నుంచి 8 శాతం పెరగాలి. కోడిగుడ్లు 5-7, మాంసం ఉత్పత్తిని 8 నుంచి 15 శాతానికి పెంచాలి.
  • పంటల సాగు, పాడి, కోళ్లు, మత్స్య పరిశ్రమలకు రక్షణ కల్పిస్తే రైతుల ఆదాయం రెట్టింపవుతుంది.
  • కందులు, తృణధాన్యాలు, కుసుమలు వంటి పంటలు పండించే రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి వాటినుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయించి మార్కెట్లకు నేరుగా ఆ సంఘాలే అమ్ముకునేలా చేయాలి.
  • వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలతో పాటు రాష్ట్రంలోని ఇక్రిశాట్‌ వంటి వ్యవసాయ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తల సమన్వయంతో, నేలల స్వభావం, వాతావరణాన్ని బట్టి ‘పంటల కాలనీలు’ ఏర్పాటు చేయాలి.
  • రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్నా సగటు ఉత్పాదకత తగ్గిపోతోంది. మామిడి దిగుబడులు పెంచడానికి అవకాశాలున్నాయి. ఏళ్లనాటి పాత తోటల నుంచి పూత, కాత సరిగా రావడం లేదు.
  • నాణ్యమైన విత్తనాలను ఇవ్వడానికి ‘విత్తన గ్రామం’ పధకం అమలు చేయాలి.
  • ఏయే రంగాల్లో ఎంత వార్షిక వృద్ధి రేటు ఉంటే రైతుల ఆదాయం రెట్టింపవుతుందని ఐసీఏఆర్‌ సూచించింది. రాష్ట్రంలో 2015-20 మధ్య ఐదేళ్లలో రెండు సార్లు(2016-17, 2019-20) మాత్రమే నిర్ణీత 10.5 శాతం కన్నా ఎక్కువ వృద్ధి రేటు సాధ్యమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.