ETV Bharat / state

భారీగా ఐఏఎస్​ల బదిలీలు... కొత్త పోస్టింగ్​లు ఇవే... - IAS OFFICERS TRANSFERS IN TELANGANA

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. 21 జిల్లా కలెక్టర్లు సహా పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం కలిగింది. జూనియర్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చిన ప్రభుత్వం... త్వరలోనే మరికొంత మందిని.. బదిలీ చేయనుంది. మొత్తం 65 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం 50 మందికి పోస్టింగ్‌లు ఇచ్చింది.

IAS OFFICERS TRANSFERS IN TELANGANA
IAS OFFICERS TRANSFERS IN TELANGANA
author img

By

Published : Feb 3, 2020, 6:38 AM IST

Updated : Feb 3, 2020, 7:03 AM IST

IAS OFFICERS TRANSFERS IN TELANGANA
భారీగా ఐఏఎస్​ల బదిలీలు... కొత్త పోస్టింగ్​లు ఇవే...

గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఐఏఎస్‌ అధికారుల బదిలీ ఎట్టకేలకు జరిగింది. పురపాలక ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీల ప్రక్రియను సీఎం కేసీఆర్​ ముమ్మరం చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 65 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం 50 మందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. 21 జిల్లాల కలెక్టర్లను మార్చింది. పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకూ స్థానచలనం కలిగించింది.

2015-16 బ్యాచ్​ ఐఏఎస్​లకు పోస్టింగ్​లు...

ఆయా జిల్లాల్లో సబ్‌ కలెక్టర్లు, ప్రత్యేక అధికారులుగా పనిచేస్తున్న 2015- 16 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులను ఇతర చోట్లకు ప్రభుత్వం బదిలీ చేసింది. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా గౌతంపోత్రు, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ భవేజ్‌మిశ్రను నియమించింది. ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా హనుమంతు కొండిబాను నియమించింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా రాహుల్ రాజ్‌, సంతోష్‌, ప్రియాంక, ప్రావీణ్యలకు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా వల్లూరు క్రాంతిని రామగుండం మున్సిపల్‌ కమిషనర్‌గా ఉదయ్‌కుమార్‌ను నియమించారు. నిజామాబాద్ మున్సిపల్‌ కమిషనర్‌గా జితేష్‌ వి పాటిల్‌, నిజాంపేట మున్సిపల్‌ కమిషనర్‌ గోపికి బాధ్యతలు అప్పగించారు. బదిలీ చేసిన అధికారుల్లో కొంతమందికి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు.

నేడో రేపో... ఉత్తర్వులు...!

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్‌కుమార్‌ను బదిలీ చేయగా... ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. ఇందుకోసం ముగ్గురు సీనియర్‌ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. మరికొంత మంది అధికారులకు కూడా పోస్టింగ్‌లు ఇవ్వడంతో పాటు బదిలీలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి.

ఇవీ చూడండి: అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!

Last Updated : Feb 3, 2020, 7:03 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.