ETV Bharat / state

నేడే ఐసెట్​ నోటిఫికేషన్ - ts icet

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్​ ఐసెట్​ నోటిఫికేషన్​ 2019-20 సంవత్సరాలకు శుక్రవారం విడుదల కానుంది.

నేడే ఐసెట్​-2019 నోటిఫికేషన్
author img

By

Published : Mar 8, 2019, 7:01 AM IST

Updated : Mar 8, 2019, 10:51 AM IST

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్​ ఐసెట్​ నోటిఫికేషన్​-2019-2020 శుక్రవారం విడుదల కానుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ ఆచార్య టి. పాపిరెడ్డి నోటిఫికేషన్​ విడుదల చేస్తారని ఐసెట్​- 2019 కన్వీనర్​ ఆచార్య సీహెచ్​ రాజేశం తెలిపారు.
మే23,24 తేదీల్లో పరీక్షలు
ఈనెల 11 నుంచి అంతర్జాలంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలస్య రుసుం లేకుండా మే మూడో తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రకాల ఆలస్య రుసుముతో మే 18తో గడువు ముగుస్తుంది. మే 9 నుంచి ఆన్​లైన్​ ద్వారా హాల్​టికెట్​లు పొందవచ్చు. మే 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్​లైన్​లో పరీక్ష నిర్వహిస్తారు. అదే నెల 29న ప్రాథమిక కీని విడుదల చేస్తారు. జూన్​ 1వరకూ కీ పైన అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్​ 13న తుది ఫలితాలు వెల్లడిస్తామని రాజేశం తెలిపారు.

ఇవీ చదవండి:కొంపముంచింది ట్రక్కే..

sample description
Last Updated : Mar 8, 2019, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.