నగరంలో శాంతి భద్రతోపాటు ప్రజారోగ్యాన్ని కాపాడడంతో పోలీసులు కీలకపాత్ర వహించాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్లో 1.4శాతం ప్రజలు పొగ తాగుతున్నారన్నారు. పొగాకు వల్ల చాలా మంది కేన్సర్ బారినపడుతున్నారని సీపీ వివరించారు. రెండు రోజులపాటు జరగనున్న సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బహిరంగంగా ధూమపానం చేసేవాళ్లపై చట్టపరంగా తీసుకునే చర్యలపై ఎస్సై, ఏఎస్సైలకు అధికారులు అవగాహన కల్పించారు.
పోలీసులూ ఇలా చేయండి...
మొదట ఠాణా పరిసర ప్రాంతాల్లో వంద మీటర్ల దూరంలో ఎవరూ పొగతాగకుండా చూడాలని, తర్వాత పరిధి పెంచుకుంటూ పోతే నగరమంతా ధూమపానరహితంగా మారుతుందని సూచించారు. పోలీసులు, మీడియా ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ సదస్సులో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లకు పొగాకు వినియోగాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు వివరించనున్నారు.
ఇదీ చదవండి: 'ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ నంబర్ వన్'