కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజాం కళాశాల ఎన్సిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బషీర్బాగ్లో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి కాలుష్య కారకాలు, నివారణ మార్గాలపై నినాదాలు చేశారు. నానాటికి పెరుగుతున్న కాలుష్యంపై ప్రజల్లో అవగాహన మరింత పెరగవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి కాలుష్యం పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిజాం కళాశాల అధ్యాపకులు తెలిపారు.
ఇదీ చూడండి : విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని సర్పంచ్ ధర్నా