రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆది, సోమ, మంగళ వారాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవొచ్చని పేర్కొంది.
ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్ర సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. అందువల్లే వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం