ETV Bharat / state

కార్ల అద్దాలకు బ్లాక్‌ఫిలిం అనధికార స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్

Hyderabad traffic police: కార్ల అద్దాలకు బ్లాక్‌ఫిలిం అనధికార స్టిక్కర్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనధికార స్టిక్కర్లు ఉన్న వాహనాలు గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. రాజకీయ పదవులు, పోలీస్, ప్రెస్ స్టిక్కర్లపైనా దృష్టి పెట్టారు. అక్రమంగా వివిధ హోదాల స్టిక్కర్లు ఉన్న వాహనాలపైనా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

Police removing black film on car
కారుకు బ్లాక్‌ఫిలిం తొలగిస్తున్న పోలీసులు
author img

By

Published : Mar 20, 2022, 5:38 PM IST

Hyderabad traffic police: హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన అనంతరం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు సిద్దమయ్యారు. కారు అద్దాలకు బ్లాక్​ఫిలిం, శాసనసభ, మండలి,లోక్‌సభ సభ్యుల పేరుతో ఉన్న స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై నిఘా పెట్టారు. వాహనంలో సంబంధిత వ్యక్తిలేకపోయినా స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నట్లు గుర్తించారు.

శనివారం నుంచి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బ్లాక్‌ఫిలిం ఉన్న కార్లను నిలిపి అక్కడికక్కడే తొలగిస్తున్నారు. చలాన్లు విధిస్తున్నారు. ఏపీ పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్‌తో తిరుగుతున్న కారుపై కేసు నమోదు చేసి స్టిక్కర్‌ను తొలగించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఆ పరీక్షలకు 15 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి.. నేటి నుంచే హాల్​టికెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.