ETV Bharat / state

గ్రీన్​ ఛానల్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మరో ఘనత

author img

By

Published : Aug 24, 2020, 9:40 PM IST

కలకత్తాలో బ్రెయిన్​ డెడ్​ అయిన వ్యక్తి కాలేయం, మూత్రపిండాలను బేగంపేట కిమ్స్​ ఆసుపత్రికి చేరవేసేందుకు హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు గ్రీన్​ ఛానల్​ను ఏర్పాటు చేసి మరోసారి వారి ఘనత చాటుకున్నారు. శంషాబాద్​ విమానాశ్రయం నుంచి కిమ్స్​ ఆసుపత్రికి కేవలం 30 నిమిషాల్లో చేరేలా ఏర్పాటు చేశారు.

hyderabad traffic police supported for organ transportation through green channel
గ్రీన్​ ఛానల్ ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మరో ఘనత

హైదరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు మరోసారి వారి మంచి మనస్సును చాటుకున్నారు. గ్రీన్​ ఛానల్​లో భాగంగా కలకత్తాలో బ్రెయిన్​ డెడ్​ అయిన వ్యక్తి నుంచి కాలేయం, మూత్రపిండాలు సేకరించి.. అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం 6.39 నిముషాలకు శంషాబాద్​ విమానాశ్రయం నుంచి 30 నిముషాల్లోనే కిమ్స్​ ఆసుపత్రికి చేరుకునేలా ట్రాఫిక్​ పోలీసులు ఏర్పాట్లు చేశారు.

సైబరాబాద్ ట్రాఫిక్​ పోలీసులతో సమన్వయం చేసుకుని అవయవాలను భద్రంగా చేరేలా చూశారు. ఓ మనిషి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను పలువురు ప్రశంసించారు. ఇప్పటివరకు అవయవాలను భద్రంగా గమ్యస్థానానికి చేరవేసేందుకు ఐదు సార్లు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.