ETV Bharat / state

భళా పోలీస్: ఓ వైపు కఠినత్వం.. మరోవైపు ఔదార్యం

author img

By

Published : May 6, 2020, 8:53 AM IST

లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు... తమ దయార్ధ్ర హృదయాన్ని చాటుతున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపుతున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సొంతంగా డబ్బులు వేసుకుని.. రోజూ అన్నదానం చేస్తున్నారు.

Hyderabad traffic police food distribution to poor people daily
హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసుల ఔదార్యం.. రోజూ అన్నదానం

కరోనాను ఎదుర్కొవడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ అమలులో పోలీసులదీ ప్రధాన పాత్ర. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 లక్షలకు పైగా వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. సుమారు 70 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తమలోని దాతృత్వాన్ని చాటుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి... రహదారులపై ఆకలితో అలమటిస్తున్న అన్నార్తుల కడుపు నింపుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్‌ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న పోలీసులు తామే సొంతంగా డబ్బులు వేసుకుని రోజూ అన్నదానం చేస్తున్నారు. స్వయంగా అన్నం, కూరలు వండి ప్యాకింగ్ చేసి రహదారుల పక్కన ఉండే వాళ్లకు అందిస్తున్నారు.

ఉదయం 6 గంటల నుంచే ఏర్పాట్లు

హైదరాబాద్ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ ఎదురుగా, పబ్లిక్ గార్డెన్స్‌లో రోజూ... వందల సంఖ్యలో కూలీలు రహదారుల పక్కన అన్నం కోసం ఎదురుచూస్తుంటారు. ఎవరైనా దాతలు రాగానే అన్నం కోసం పరుగులు పెట్టే దృశ్యాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు... వారి ఆకలి తీర్చేందుకు నడుం కట్టారు. నిత్యం విధుల్లో తలమునకలై ఉండే పోలీసన్నలు... అన్నదానం కోసం సమయం కేటాయించుకున్నారు. రోజు ఉదయం 6 గంటల నుంచే ఏర్పాట్లు చేసుంకుంటున్నారు. కూరగాయల కొనుగోలు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంట గది శుభ్రంగా ఉంచడంతో పాటు.. వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారు. అన్నం, కూర వండి వాటిని ప్యాకింగ్ చేసి పెట్టుకుంటారు. మధ్యాహ్న సమయానికి వాటిని పంపిణీ చేస్తారు.

అడ్మిన్ సీఐ రాజు సహకారంతో

కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న అడ్మిన్ సీఐ రాజు సహకారంతో... అందులో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులు తలా కొంత నగదు వేసుకుంటున్నారు. రోజుకు సుమారు 300 మందికి రెండు పూటలా అన్నం అందిస్తున్నారు. అన్నం, సాంబరు, కూరతో పాటు ఒక గుడ్డు కూడా భోజనంలో ఉండేలా చూస్తున్నారు. అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకొని.. కొంతమంది దాతలు ముందుకు వచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ ట్రాఫిక్ పోలీసులకు సాయం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ కొనసాగినన్ని రోజులు భోజనం అందించేలా ట్రాఫిక్‌ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కఠినంగా వ్యహరించడమే కాదు... అన్నార్తులకు ఆపన్నహస్తం అందిస్తూ... అందరి మన్ననలు అందుకుంటున్నారు.

ఇవీ చూడండి: 'కొన్ని రాష్ట్రాల తప్పుడు లెక్కలతోనే ఈ పెరుగుదల'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.