ETV Bharat / state

పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో జీహెచ్ఎంసీ టాప్​ - hyderabad top in pm loans

పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో జీహెచ్‌ఎంసీ ఘనత సాధించింది. ఈ పథకం అమలులో దేశంలోనే జీహెచ్ఎంసీ తొలిస్థానం సాధించింది. 34,878 మంది వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.

hyderabad
hyderabad
author img

By

Published : Mar 27, 2021, 8:32 PM IST

నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో దేశంలోని ఇతర నగరాలకన్నా జీహెచ్ఎంసీ అగ్రస్థానంలో ఉంది. ఒక్కొక్క చిరు వ్యాపారికి రూ.10వేల తక్షణ సాయం అందించడంలో భాగంగా రికార్డు స్థాయిలో 34,878 మందికి అందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు తిరిగి ప్రారంభించేలా చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది.

34,878 మందికి రుణాలు

2020 జులై 2న ఈ పథకం ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 1,62,105 మంది చిరువ్యాపారులను గుర్తించగా వీరిలో 1,57,945 మంది చిరువ్యాపారుల వివరాలను మెప్మా పోర్టల్​లో అప్ లోడ్ చేశారు. 1,54,335 మంది చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీచేశారు. ఈ చిరువ్యాపారుల్లో ఒకొక్కరికి రూ.10వేలు తక్షణ సాయం అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా 67,233 మంది అప్లై చేసుకున్నారు. అర్హులైన 42,911 మందికి రుణాలు మంజూరు కాగా నేటి వరకు 34,878 మందికి రుణాలను అందించడం ద్వారా దేశంలోని ఇతర నగరాలకన్నా గ్రేటర్ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.

డిజిటల్ లావాదేవీలకు ప్రత్యేక కృషి

హైదరాబాద్ తర్వాత ఇండోర్ నగరం 34,855 చిరువ్యాపారులకు రుణాలను అందించి ద్వితీయ స్థానంలో నిలిచింది. 34,195 మందికి రుణాలను అందించి లఖ్​నవూ తృతీయ స్థానంలో, కాన్పూర్ 32,751 నాల్గో స్థానంలో, వారణాసి 27,023 ఐదో స్థానంలో నిలిచింది. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్​లోని చిరువ్యాపారులు తమ లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో చేసేందుకు కూడా జీహెచ్ఎంసీ ప్రత్యేక కృషి చేపట్టింది. బీమ్, పేటీఎం, గూగుల్ పే, భారత్ పే, ఫోన్ పే, అమెజాన్ పే తదితర యాప్​ల ద్వారా తమ లావాదేవీలను చేపట్టేందుకు శిక్షణ కూడా ఇప్పించారు. దీంతో పాటు ప్రతి ఒక్క వీధి వ్యాపారి ప్రతి నెలలో కనీసం 50 డిజిటల్ లావాదేవీల నుంచి అధిక సంఖ్యలో చేసినవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించారు.

ఇదీ చదవండి : రేపు నాగార్జునసాగర్​ అభ్యర్థిని ప్రకటించనున్న తెరాస!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.