హైదరాబాద్ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనల పర్యాటకం - మైక్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ కన్వెన్షన్ విజిటర్స్ బ్యూరో ప్రతినిధులు, అధికారులతో సమావేశమైన మంత్రి... మైక్ పర్యాటకంపై సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ ఎన్నో అంతర్జాతీయ స్థాయి సదస్సులు, ప్రదర్శనలకు వేదికైందని... లండన్, ప్యారిస్, న్యూయార్క్, సిడ్నీ, బీజింగ్, టోక్యో, దుబాయ్ లాంటి నగరాల సరసన భాగ్యనగరాన్ని నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్మమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అనుసరిస్తున్న నూతన విధానాల వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా రూపొందించే ప్రక్రియలో పర్యాటక శాఖ తన వంతుగా మైక్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ తరహా పర్యటక అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు, ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన