ETV Bharat / state

పాక్ పంజరంలో 'ప్రేమ పావురం..!'

author img

By

Published : Nov 19, 2019, 10:58 PM IST

పాక్ చెరలో ఉన్న ప్రశాంత్ ఆచూకీ గురించి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగొచ్చేందుకు సహకరించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రశాంత్ తండ్రి బాబురావు సైబరాబాద్ సీపీ సజ్జనార్​ను కలిశారు. దిల్లీ వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. అన్ని విధాలా సహకరిస్తామని బాబురావుకు కేటీఆర్ హామీ ఇచ్చారు. అసలు ప్రశాంత్ పాకిస్థాన్​లోకి ఎలా వెళ్లాడు.. అతనితో పట్టుబడ్డ దరీలాల్​ పరిచయం గురించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పాక్ పంజరంలో 'ప్రేమ పావురం..!'

పాక్ పంజరంలో 'ప్రేమ పావురం..!'

పాకిస్థాన్‌ చెరలో తెలుగు యువకుడు ప్రశాంత్‌ చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ప్రశాంత్‌ను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలంటూ సోషల్‌ మీడియా వేదికగా పోలీసులను నెటిజన్లు అభ్యర్థిస్తున్నారు.

విశాఖపట్నానికి చెందిన బాబూరావు కుటుంబం గత ఐదేళ్లుగా కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. ప్రశాంత్‌ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు. దీనిపై ఏప్రిల్‌ 29, 2017న బాబూరావు మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

సైబరాబాద్ సీపీని కలిసిన ప్రశాంత్ తండ్రి

బాబురావు సైబరాబాద్ సీపీ సజ్జనార్​ను కలిశారు. తన కుమారుడిని తిరిగి తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. తన కుమారుడు సంఘ విద్రోహి కాదని.. ప్రేమ వ్యవహరం వల్లే రాజస్థాన్​కు వెళ్లి దారి తప్పి ఉంటాడని బాబురావు భావిస్తున్నారు.

దిల్లీ వెళ్లనున్న ప్రశాంత్ తండ్రి

సైబరాబాద్ సీపీని కలిసిన బాబురావు.. దిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విదేశాంగ శాఖ అధికారులను కలిసి.. తన కుమారుడిని క్షేమంగా తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరనున్నారు.

దరీలాల్​తో ప్రశాంత్​కేంటి సంబంధం...?

ఈ వ్యవహారం సంచలనం కావడంతో.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంత్ 2017 నుంచి ఎక్కడెక్కడ తిరిగారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇక ప్రశాంత్‌తో పట్టుబడ్డ దరీలాల్‌తో ఎలా పరిచయం ఏర్పడింది... అనే కోణంలో విచారణ చేయనున్నారు. విశాఖ పోలీసుల సహాయంతో మరింత సమాచారం సేకరించి కేంద్రహోంశాఖకు పంపుతామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం

ప్రశాంత్ వ్యవహారం తెలిసిన తరువాత కూకట్​పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు వారి ఇంటికి వెళ్లి అతని తండ్రి బాబురావును పరామర్శించారు. మంత్రి కేటీఆర్​తో ఫోన్​లో మాట్లాడించారు. ప్రశాంత్​ను పాకిస్థాన్ నుంచి దేశానికి రప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

ఇవీచూడండి: 'నా కొడుకు సంఘ విద్రోహ శక్తి కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.