హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని సబ్జిమండికి చెందిన శ్రేయ ఎడ్‌సెట్ ప్రవేశ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఇటీవలే బీఏ పూర్తి చేసిన శ్రేయ బీఈడీ ఉపాధ్యాయ విద్య అభ్యసించేందుకు ఎడ్‌సెట్ రాశారు.
తల్లిదండ్రుల ఆనందం
కార్వాన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో శ్రేయ తల్లి రాజ్యలక్ష్మి బెస్త ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె అద్భుత విజయం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురు సివిల్ సర్వీసెస్ రాసి కలెక్టర్ కావాలనేది తమ ఆకాంక్ష అని తండ్రి జై కిషన్ బెస్త తెలిపారు.
తమ మనవరాలు రెండో ర్యాంకు కైవసం చేసుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని శ్రేయ అమ్మమ్మ కౌసల్య బెస్త ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్ కొట్టివేత