ETV Bharat / state

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు - ఇప్పటికైనా పనులు మొదలయ్యేనా? - హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నిర్మాణం

Hyderabad Regional Ring Road Project : హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. వినిమయ వస్తువుల తరలింపు భారంపై రాష్ట్రం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

Hyderabad Regional Ring Road Project
Hyderabad Regional
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 9:28 AM IST

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు - నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారా?

Hyderabad Regional Ring Road Project : ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణంలో చిక్కుముడులు వీడనున్నాయి. తొలుత నిర్మాణం చేపట్టనున్న ఉత్తర భాగం మార్గంలో ఉన్న విద్యుత్, టెలికాం, తాగునీటి పైపులు తదితర వినిమయ వస్తువుల తరలింపు భారాన్ని ఎవరు భరించాలన్న అంశం కొన్ని నెలలుగా పీటముడిగా మారింది. దీనిపై తాము సానుకూలంగా ఉన్నట్లు తాజాగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రానికి సూచనప్రాయంగా తెలిపారు. దీంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టిపెట్టారు.

Another step For Construction Hyderabad RRR Project : హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ORR)కు వెలుపల రెండు భాగాలుగా 347.84 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. తొలి దశ కింద చేపట్టే 158.64 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం రెండేళ్ల కిందటే జాతీయ రహదారి హోదా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భాగంలో 70 శాతానికి పైగా భూసేకరణ వ్యవహారం కొలిక్కి వచ్చింది. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సమానంగా భరించేందుకు ఒప్పందం చేసుకున్నాయి.

కావాలని కక్ష సాధించం కానీ - మా మొదటి ప్రాధాన్యత అదే : మంత్రి కోమటిరెడ్డి

Hyderabad Regional Ring Road Project Construction : రహదారి నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరించాలి. అయితే రహదారి నిర్మాణ వ్యయం భారీగా ఉన్నందున యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం గతంలో లేఖ రాసింది. భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని భూసేకరణ వ్యయంలో సగం భరించేందుకు అంగీకరించామని, యుటిలిటీస్‌ తరలింపు వ్యయం భరించటం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ప్రత్యుత్తరం రాసింది. దీంతో గత ఆరేడు నెలలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వీటి తరలింపునకు సుమారు రూ.200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా.

Minister Komatireddy Venkat Reddy on Hyderabad RRR Project : తాజాగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టు(National Highways Project)లపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చర్చించారు. యుటిలిటీస్‌ తరలింపు వ్యయం ప్రస్తావనకు రాగా, తమవంతు సహకారం అందిస్తామని తెలిపిన కోమటిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి వివరించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి చివరలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆలోగా ఉత్తర భాగం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఏప్రిల్‌ నాటికి దిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణ పనులు : కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

నల్గొండను కాంగ్రెస్ కంచుకోటగా మార్చడంలో కీలక పాత్రధారి - కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రస్థానమిదీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.