ETV Bharat / state

Hyderabad Rains Today : హైదరాబాద్​కు రెడ్ అలర్ట్.. మరో గంటపాటు కుండపోత వర్షం.. విద్యాసంస్థలకు సెలవు - telangana rains today

Hyderabad Rains Red Alert
Hyderabad Rains Today
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 8:20 AM IST

Updated : Sep 5, 2023, 9:10 AM IST

08:16 September 05

Hyderabad Rains Red Alert : హైదరాబాద్‌లో మరో గంటపాటు కుండపోత వర్షం

Hyderabad Rains Today 2023 : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు(Telangana Rains in September 2023) కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే భాగ్యనగరంలో మరో గంటపాటు వర్షం కుండపోతగా పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రాజధానిలో పలుచోట్ల 10 సెంటిమీటర్లు దాటి కురుస్తుందని అంచనా వేసింది. మరోవైపు.. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.

Heavy Rains in Telangana Today : బీ అలర్ట్‌.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీ

Holidays for Schools in Telangana : వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC on Rains 2023) అధికారులు అప్రమత్తమయ్యారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ 040-2111 1111కు ఫోన్ చేయాలని కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ సూచించారు. ఈవీడీఎం కంట్రోల్ రూమ్‌ 9000113667కు ఫోన్ చేయాలన్నారు. హైదరాబాద్ వాసులు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.

Hyderabad Rains Updates : భారీ వర్షాలతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి, ట్రాన్స్‌కో ఎండీలతో మాట్లాడిన మంత్రి.. ఎక్కడా నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలకు కూలిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలన్న ఆయన.. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని అధికారులకు సూచించిన మంత్రి తలసాని.. హైదరాబాద్ వాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.

Heavy Rains in Nizamabad District : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో విస్తారంగా వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. ఇప్పటికే రెండు జలాశయాలు పూర్తిగా నిండగా.. మరో రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ చెరో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిషోర్‌ హెచ్చరించారు.

హైదరాబాద్‌లో గడిచిన 22 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు..

  • చందానగర్‌ సర్కిల్‌ 14.1 సెం.మీ. వర్షపాతం
  • కూకట్‌పల్లి సర్కిల్‌ 12.7 సెం.మీ. వర్షపాతం
  • రాజేంద్రనగర్‌ సర్కిల్‌ 12 సెం.మీ. వర్షపాతం
  • జూబ్లీహిల్స్‌ సర్కిల్‌ 12 సెం.మీ. వర్షపాతం
  • యూసుఫ్‌గూడ సర్కిల్‌ 11.7 సెం.మీ. వర్షపాతం
  • మూసాపేట సర్కిల్‌ 11 సెం.మీ. వర్షపాతం
  • గాజులరామారం సర్కిల్‌ 11 సెం.మీ. వర్షపాతం
  • కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ 10.7 సెం.మీ. వర్షపాతం
  • చందానగర్‌ సర్కిల్‌ 10.7 సెం.మీ. వర్షపాతం
  • ఖైరతాబాద్‌ సర్కిల్‌ 10.2 సెం.మీ. వర్షపాతం
  • శేరిలింగంపల్లి సర్కిల్‌ 10.1 సెం.మీ. వర్షపాతం

Prathidwani : ప్రాణాంతకంగా మారుతున్న నాలాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు

Last Updated : Sep 5, 2023, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.