హైదరాబాద్లో సోమవారం మరోసారి భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే వందల కాలనీలు నీటిలో ఉండగా, సోమవారం మరోసారి భారీ వర్షం పడితే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత స్థలాలకు తరలించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
జంటనగరాల్లోని అన్ని ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. పోలీసుల సాయంతోనైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించాలని స్పష్టం చేశారు. ఓ వైపు సహాయక చర్యలు చేస్తూనే.. మరోవైపు పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఇదీ చదవండిః వర్షాలు తగ్గినా.. కష్టాలు తీరడం లేదు