ETV Bharat / state

క్షణాల్లో ఆర్డర్‌.. గంటల్లోనే డ్రగ్స్‌ సరఫరా

అదో మత్తు సామ్రాజ్యం. సామాన్యుల్లా కనిపించే వ్యక్తుల చేతుల మీదుగా రూ.కోట్లు చలామణి అవుతుంటాయి. డ్రగ్స్‌ వ్యాపారులు దేశంలో ఏ మూలకైనా గంటల వ్యవధిలోనే సరకును చేరవేసేందుకు గట్టి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.

Drugs
Drugs
author img

By

Published : Sep 4, 2022, 7:21 AM IST

హైదరాబాద్‌ నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌న్యూ) కీలకమైన డ్రగ్‌ డీలర్‌ నరేంద్ర ఆర్యను ఇటీవల అరెస్టు చేశారు. ఇతడు కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే ఇద్దరు డెలివరీ బాయ్స్‌ను ఏర్పాటు చేసుకొని 450 మందికి డ్రగ్స్‌ అందించినట్టు గుర్తించారు. ఆ తరువాత డార్క్‌నెట్‌ ద్వారా హైదరాబాద్‌కు ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాలు చేరవేస్తూ వచ్చాడు. గోవాలో ఇతడి లాంటి డీలర్లు వందల సంఖ్యలో ఉంటారని పోలీసుల అంచనా.

రూ.లక్షల్లో ఆదాయం వస్తుండడంతో వ్యసనపరుల్లో 50 శాతం మంది క్రమంగా విక్రయదారులు/డీలర్లుగా మారుతున్నట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు అలవాటుపడిన వారిలో కొందరికి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారితో పరిచయాలున్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరి ద్వారా ఆ ప్రాంతాల వారికి మత్తుపదార్థాలు సరఫరా అయ్యాయా అని ఆరా తీస్తున్నారు.

దుస్తుల ముసుగులో: డార్క్‌నెట్‌లో వ్యాపారం చేసే ఏజెంట్లు మొబైల్‌ ఫోన్లలో కేవలం 20-30 క్షణాల్లో సరకుకు ఆర్డర్లు ఇస్తున్నారు. కొరియర్‌ ద్వారా 24 గంటల్లో గమ్యానికి చేర్చుతున్నారు. డ్రగ్స్‌ పార్సిళ్లను చీరలు, టీ షర్టులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులుగా నమ్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థల పేర్లు వాడుకుంటున్నారు. తేలికగా తెరిచేందుకు వీల్లేకుండా ప్యాకింగ్‌లో 10-15 కవర్లు చుట్టి దృఢంగా మార్చుతున్నారు. ఇలా హైదరాబాద్‌లో రోజూ 200-250 మందికి సరఫరా చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

హైదరాబాద్‌ పోలీసులు ఛేదించాక.. ఆ సంఖ్య భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. మత్తుకు అలవాటుపడిన వారికి ఏపీ, తెలంగాణల్లో డీజేలు, ఈవెంట్‌ మేనేజర్లతో సంబంధాలున్నట్టు తాజాగా వెలుగు చూసింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర నగరాల్లో కొన్ని ముఠాలు డ్రగ్స్‌ సరఫరాకు వ్యభిచారిణులను ఉపయోగించుకుంటున్నాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుందనే ఉద్దేశంతో విటులు మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. ఇదే అదనుగా వారికి డార్క్‌నెట్‌ ద్వారా ఏజెంట్లు సరకు అందజేస్తున్నారు.

ఓ తండ్రి కఠిన నిర్ణయం: నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు (25) విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో విందు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. యువతీ, యువకులకు ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను విక్రయించేవాడు. సంపాదన పెరగటంతో డ్రగ్స్‌ విక్రేతగా మారాడు. గోవా నుంచి సరకు తీసుకొచ్చి వందలాది మందికి చేరవేస్తున్నాడు. ఇతడు గతంలో రెండుసార్లు పట్టుబడగా, పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా మారలేదు. ఇటీవల మూడోసారి పట్టుబడినప్పుడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపాలని అతడి తండ్రి కోరినట్టు సమాచారం.

విదేశీ డ్రగ్స్‌ అడ్డా.. గోవా: అందమైన బీచ్‌లకు మారుపేరైన గోవా ఇప్పుడు మత్తుమందులకు కేంద్రంగా మారుతోంది. హైదరాబాద్‌లో పట్టుబడుతున్న మాదకద్రవ్యాల్లో మూడొంతులు అక్కడి నుంచి వస్తున్నవే కావడం ఇందుకు నిదర్శనం. తాజాగా అరెస్టయిన నరేంద్ర ఆర్య తదితరులు గోవా కేంద్రంగా మత్తుమందులను భాగ్యనగరానికి చేరవేస్తున్నట్లు వెల్లడైంది. గంజాయి మినహా మిగతా ఖరీదైన మత్తుమందులన్నీ గోవా నుంచే దిగుమతి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో గోవా ముఠాలపై కన్నేశారు.

విదేశీ మత్తుమందులే కీలకం: కొకైన్‌, హెరాయిన్‌ వంటి ఖరీదైన మత్తుమందులు ఎక్కువగా గోవా నుంచే వస్తున్నాయి. పర్యాటక కేంద్రం కావడంతో విదేశీయులు పెద్దఎత్తున అక్కడికి వస్తుంటారు. ఈ ముసుగులో కొందరు మత్తుమందులు రవాణా చేస్తున్నారు. అంతర్జాతీయ కొరియర్‌ వ్యవస్థ ద్వారా కూడా భారీగా డ్రగ్స్‌ దిగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా రూ.కోట్లలో ఆదాయం లభిస్తుండడంతో ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు గోవాకు చేరుకుంటున్నారని, వారే దేశవ్యాప్తంగా మత్తుమందులు సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి ఒక్క హైదరాబాద్‌కు రవాణా అయ్యే మత్తుమందుల విలువే రూ.వందల కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.

పంట పండిస్తున్న హైదరాబాద్‌: పర్యాటక రంగం విస్తరించడం, గోవాకు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు పెరగడం కూడా ఈ వ్యాపారం వృద్ధి చెందడానికి కారణమైంది. ప్రతి శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకూ గోవా వెళ్లే విమానాలన్నీ విపరీతమైన రద్దీగా ఉంటుండటం ఇందుకు నిదర్శనం. అనేక కార్పొరేట్‌ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు గోవాలో పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే అక్కడి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ రవాణా పెరిగిందని పోలీసులు విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి: మత్తుమందుల ముఠాల్లో గట్టి ఇన్​ఫార్మర్​ వ్యవస్థ.. చిక్కిన కీలక సూత్రధారి

ప్రపంచంలోనే అతిపెద్ద పెన్ను.. హైదరాబాద్​ వాసి రికార్డు బద్దలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.