ఆర్టీసీ బస్సులోని ప్రయాణికుల నుంచి చరవాణిలు చోరీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 49 చరవాణిలు, 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన చరవాణిలను కొనుగోలు చేస్తున్న ఐదుగురు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలోని రసూల్‌పురకు చెందిన నుస్రతపాషా, విశాల్, మరో బాలనేరస్థుడుగా గుర్తించారు. సికింద్రాబాద్‌లోని హాంకాంగ్‌నగర్, సుభాష్‌నగర్‌లోని చరవాణి దుకాణాల్లో అమ్మినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చూడండి :రాచకొండ కమిషనరేట్ నిర్ణయంపై కేటీఆర్ హర్షం