సచివాలయంలో కూల్చిన మసీదును తిరిగి అక్కడే నిర్మించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. పాత దాని స్థానంలోనే కొత్తది నిర్మించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని పేర్కొన్నారు. మసీద్తోపాటు దేవాలయం, చర్చిని కూడా నిర్మించాలని సీఎంని కోరినట్టు తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ముస్లింల స్మశాన వాటికకు చోటు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్ రెడ్డి సమీక్ష