రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో సేవల సమయాన్ని మరింత పొడిగించాలని సీఎస్ సోమేశ్ కుమార్ మెట్రో ఉన్నతాధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంటలు వరకు మెట్రో సేవలు అందించాలని సూచించారు. సీఎస్ ఆదేశంతో రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మెట్రో సేవలు నగర ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.
ఇవాళ హైదరాబాద్ మెట్రో రైలులో సీఎస్ సోమేశ్ కుమార్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టి మెట్రో ఎండీ కేవీబీరెడ్డి ప్రయాణించారు. ఖైరతాబాద్ స్టేషన్ నుంచి అమీర్ పేట్ వరకు మెట్రోలో వెళ్లారు. కాసేపు ప్రయాణికులతో ముచ్చటించారు. కరోనా సమయంలో మెట్రో తీసుకుంటున్న జాగ్రత్తలపై సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి