Hyderabad Laddu For Ayodhya Ram : అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలు పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్దలతో తయారు చేసిన భారీ లడ్డు అయోధ్యకు (Ayodhya) చేరేందుకు బయలుదేరింది. సికింద్రాబాద్‌కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్, భారీ లడ్డు తయారు చేసి, అయోధ్య రామయ్య చెంతకు చేరవేస్తున్నారు.
Ayodhya Ram Mandir Prana Pratishtha : అయోధ్య రామయ్యకు సమర్పించేందుకు హైదరాబాద్ లడ్డు శోభాయాత్రగా బయల్దేరింది. రాముడి గుడికి భూమిపూజ (Ram Janma Bhoomi) జరిగిన నాటి నుంచి ప్రాణప్రతిష్ఠ ముహూర్తం వరకు మొత్తం 1,265 రోజుల సమయం పూర్తవుతుంది. దానికి గుర్తుగా అంతే 12వందల 65 కిలోల భారీ లడ్డూను తయారు చేయాలని హైదరాబాద్ వాసి సంకల్పించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నుంచి లడ్డూ తయారికీ సికింద్రాబాద్‌కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ వారు అనుమతి పొందారు. అందులో భాగంగా స్వామి వారికి నైవేద్యంగా సమర్పించేందుకు భారీ లడ్డు సిద్ధం చేశారు.
అయోధ్య రాముడిపై అభిమానం - సంక్రాంతి ముగ్గులతో ఆవిష్కృతం
1265kgs Laddu For Ram Lalla From Hyderabad : 22న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాల్లో భాగంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వాహకులు లడ్డు తయారు చేశారు. దీన్ని 21వ తేదీ 10 గంటల అక్కడికి చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు మూడ్రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో తాజాగా ఉండేందుకు పుడ్ ఇన్స్పెక్టర్లు సూచించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తయారీదారులు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ వారు సూచించిన ఆలయాల్లో ఈ లడ్డూ దర్శనమివ్వనుంది.
"రామజన్మభూమి పూజ అవుతుంటే టీవీలో చూశాము. ప్రధాని మోదీ పూజ చేశారు. అప్పుడే గుడికి ఏమైనా ఇవ్వాలి అనుకున్నాము. మాది క్యాటరింగే కాబట్టి లడ్డూ ఇవ్వాలి అని అనుకున్నాము. మొదట్లో చిన్న లడ్డూ ఇద్దామనుకున్నాము కానీ గుడి నిర్మాణం రోజు నుంచి ఓపెనింగ్ రోజు వరకు ఎన్ని రోజులు పడుతుందో అన్ని కిలోల లడ్డు ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాము. లడ్డూ చేయడానికి మొత్తం మూడు రోజులు పట్టింది. దీనిని మొత్తం 28మంది తయారు చేశారు." - నాగభూషణం రెడ్డి, లడ్డు తయారీదారు
అయోధ్య రామాలయానికి హైదరాబాద్ తలుపులు
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి, అంతే ప్రాధాన్యమున్న ప్రసాదాన్ని సమర్పించే భాగ్యం తగ్గడం అదృష్టంగా భావిస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు. ఇంతటి అవకాశం దక్కడానికి సహాయం చేసిన వారందరికి వారు ధన్యవాదాలు తెలిపారు.
అయోధ్య సీతమ్మకు 60 మీటర్ల 'ధర్మవరం పట్టుచీర' - అంచులపై రామాయణ ఘట్టాలు చిత్రీకరణ
అయోధ్య రాముడి కోసం 45 టన్నుల లడ్డూలు- ప్రసాదంగా ఇంకా ఏమేం ఇస్తారంటే?