భాగ్యనగర ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా ఫిట్ హైదరాబాద్ పేరుతో నెక్లెస్ రోడ్డులో 2కే, 5కే, 10కే రన్ నిర్వహించారు. యువతీ యువకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా వద్ద నుంచి ప్రారంభమైన పరుగు ట్యాంక్‌బండ్ చుట్టూ కొనసాగింది.
నిత్యం పని ఒత్తిడితో ఉండే ప్రజలు రోజు అర గంట తప్పని సరిగా నడక, పరుగు చేయాలని... అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన పెంచేందుకే హైదరాబాద్ ఫిట్ పరుగు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం