ETV Bharat / state

CP Anjani Kumar: పోలీసులకు దొరికిపోతానన్న భయంతోనే ఆత్మహత్య: సీపీ అంజనీ కుమార్

పోలీసులకు దొరికిపోతానన్న భయంతోనే నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ప్రాథమిక ఆనవాళ్ల ఆధారంగా అతని కుటుంబ సభ్యులు కూడా మృతదేహం రాజుదేనని నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.

CP Anjani Kumar
సీపీ అంజనీ కుమార్
author img

By

Published : Sep 16, 2021, 7:31 PM IST

మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా రాజుగా గుర్తించినట్లు హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్ (CP ANJANI KUMAR) తెలిపారు. వరంగల్​ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్ సమీపంలో రైల్వే ట్రాక్​పై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజు ప్రాథమిక గుర్తులను కుటుంబ సభ్యులతో నిర్ధారించుకున్నట్లు స్పష్టం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోలేననే భయంతోనే నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారమిచ్చినట్లు వెల్లడించారు.

ప్రాథమిక ఆనవాళ్ల ఆధారంగానే అతని కుటుంబ సభ్యులు మృతదేహం రాజుదేనని నిర్ధారించారని సీపీ తెలిపారు. అతనికి ఒక చేతిపై తెలుగులో మౌనిక అని, మరో చేతిపై ఇంగ్లీష్​లో పేరు ఉన్నట్లు వెల్లడించారు. అతని కుడిచేతిపై ఐదు స్టార్​ గుర్తులు కూడా ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత ఆరు రోజులుగా అతని కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. అందువల్లనే పోలీసుల నుంచి తప్పించుకోలేనని అతడు భావించి ఉంటాడని సీపీ అన్నారు. పోలీసులకు దొరికి పోతానన్న భయంతోనే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

ఈరోజు ఉదయం వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్​పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్​పై మృతదేహం దొరికింది. ప్రాథమిక గుర్తుల ప్రకారం అతని ఒక చేతిలో మౌనిక అని తెలుగులో, మరో చేతిపై ఇంగ్లీష్​లో ఉంది. ఐదు స్టార్ గుర్తులు కుడా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారు కూడా రాజుదేనని నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు రోజులుగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోలేనని అతను భావించాడు. పోలీసులకు దొరికిపోతానన్న భయంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. - అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

మంత్రి కేటీఆర్‌ ట్వీట్

నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ (MINISTER KTR) ట్విటర్​ ద్వారా వెల్లడించారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయినట్లు​ ట్విటర్​ వేదికగా తెలిపారు. జనగామ జిల్లాలోని స్టేషన్​ ఘన్​పూర్​ రైల్వే ట్రాక్​పై మృతదేహాం గుర్తించినట్లు డీజీపీ మహేందర్​ రెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు.

ట్విటర్​ వేదికగా డీజీపీ

సైదాబాద్ ఘటన నిందితుడి మృతదేహం గుర్తించినట్లు డీజీపీ మహేందర్​రెడ్డి (DGP) ట్విటర్​ వేదికగా తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైందన్నారు. నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా మృతదేహం గుర్తించినట్లు పేర్కొన్నారు.

సీపీ అంజనీ కుమార్

ఇదీ చూడండి: Saidabad Incident: సైదాబాద్ హత్యాచార నిందితుడి మృతదేహం ఎంజీఎంకు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.