హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలోని సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల మేళాను సాలార్ జుంగ్ మ్యూజియంలో పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఏర్పాటు చేశారు. సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీషీటర్ల పేర్లను పోలీస్ రికార్డుల్లో నుంచి తొలగించినట్టు సీపీ వెల్లడించారు.
వారంతా ఒక కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించామని ఆయన తెలిపారు. గతంలో అనేక నేరాలు చేసి జైల్‌కు వెళ్లి వచ్చినా.. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబంతో సంతోషంగా సాధారణ పౌరులుగా జీవించాలని వారికి అంజనీకుమార్ సూచించారు. ఈ 31మంది తిరిగి ఎలాంటి నేరాలు చేసినా, చట్టానికి విఘాతం కలిగించిన మళ్లీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు